2030 వరకు టీఆర్ఎస్ దే అధికారం : కేసీఆర్ ను మించిన హిందువు లేడు

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మీడియాతో చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2030 వరకు అధికారం టీఆర్ఎస్ దే అని చెప్పారు.

  • Published By: veegamteam ,Published On : January 1, 2020 / 11:37 AM IST
2030 వరకు టీఆర్ఎస్ దే అధికారం : కేసీఆర్ ను మించిన హిందువు లేడు

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మీడియాతో చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2030 వరకు అధికారం టీఆర్ఎస్ దే అని చెప్పారు.

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మీడియాతో చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2030 వరకు అధికారం టీఆర్ఎస్ దే అని చెప్పారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం కేటీఆరే అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కేసీఆరే సీఎంగా ఉంటారని కేటీఆర్ తేల్చి చెప్పారు. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ తమకు శత్రువులు కాదన్న కేటీఆర్.. కేవలం ప్రత్యర్థులు మాత్రమే అని చెప్పారు. 

మున్సిపల్ ఎన్నికల్లో అందరికంటే ముందున్నామని కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయడం లేదన్నారు కేటీఆర్. టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే అని చెప్పారు. కాంగ్రెస్ నిర్మాణాత్మకంగా ఉన్న సంస్థ అని గుర్తు చేశారు. తన చిన్నప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉందని బీజేపీపై సెటైర్లు వేశారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ కున్న సంబంధాలపైనా కేటీఆర్ స్పందించారు. టీఆర్ఎస్, ఎంఐఎం మిత్ర పార్టీలు మాత్రమే అని చెప్పారు. కేసీఆర్ ను మించిన హిందువు లేడని కేటీఆర్ వెల్లడించారు.

* మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తాం-కేటీఆర్
* కొత్త మున్సిపల్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలన్నదే లక్ష్యం
* జిల్లాల్లో పార్టీ భవనాలను సంక్రాంతి తర్వాత ప్రారంభించాలని అనుకుంటున్నాం
* పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతుల నిర్వహణపై కసరత్తు చేస్తున్నాం
* ఆర్టీసీ కార్మికులూ బోనస్ తీసుకునే రోజు వస్తుందేమో
* దిశా ఘటన తర్వాత మానవీయంగా స్పందించాం
* ఏపీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పోటీ చేయాలని ట్విట్టర్ లో ఏపీ వాళ్లు కోరుతున్నారు
* రాజీనామా అంశం ఉత్తమ్ వ్యక్తిగతం
* కాంగ్రెస్ పార్టీని ఇగ్నోర్ చేయడానికి లేదు
* బీజేపీ.. నేను చిన్నప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది

* హైదరాబాద్ లో సీఏఏ అనుకూల, వ్యతిరేక ర్యాలీలు జరిగాయి
* ర్యాలీకి అనుమతివ్వలేదని కాంగ్రెస్ దుర్భాషలాడడం సరికాదు
* ఫిబ్రవరి తర్వాత టీఆర్ఎస్ శ్రేణులకు శిక్షణా తరగతులు
* డిజిటల్, సోషల్ మీడియా టీమ్ ను పటిష్టం చేస్తాం
* మున్సిపల్ ఎన్నికలపై రెండు రోజుల్లో కేసీఆర్ కు నివేదిక అందిస్తాం
* తర్వాత సీఎంతో మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష ఉంటుంది
* కొత్త మున్సిపల్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడమే లక్ష్యం
* చట్టానికి లోబడి పని చేయకుంటే కౌన్సిలర్లను తొలగిస్తాం
* కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది
* కాంగ్రెస్ ను ఆషామాషీగా తీసేయొద్దు
* మాకు కాంగ్రెస్ తోనే పోటీ
* రాజకీయాలకు అతీతంగా కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి
* మాకు బీజేపీ, కాంగ్రెస్ శత్రువుల కాదు.. ప్రత్యర్థులు మాత్రమే

* 2030 వరకు టీఆర్ఎస్ దే అధికారం
* టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కేసీఆరే సీఎం
* 2019లో ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు
* మున్సిపల్ ఎన్నికల్లో అందరికంటే ముందున్నాం
* గ్రామ, మండల కమిటీల నిర్మాణం 90శాతం పూర్తయింది
* రాజకీయాల్లో ఎవరూ శత్రువులు కాదు.. ప్రత్యర్థులు మాత్రమే
* టీఆర్ఎస్, ఎంఐఎం మిత్ర పార్టీలు మాత్రమే
* కేసీఆర్ ను మించిన హిందువు లేడు

Also Read : తాను చనిపోయి మరో 9 మందిని బతికించింది