కొత్త రేటు గురూ : జూ కి వెళ్తే జేబు ఖాళీ 

జూ అంటే చిన్నారు నుంచి పెద్దవారి వరకూ ఎగిరి గంతేస్తారు. పక్షుల కిలకిలలు..నుంచి కోతుల గెంతులు..

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 11:58 AM IST
కొత్త రేటు గురూ : జూ కి వెళ్తే జేబు ఖాళీ 

జూ అంటే చిన్నారు నుంచి పెద్దవారి వరకూ ఎగిరి గంతేస్తారు. పక్షుల కిలకిలలు..నుంచి కోతుల గెంతులు..

హైదరాబాద్ : జూ అంటే చిన్నారు నుంచి పెద్దవారి వరకూ ఎగిరి గంతేస్తారు. పక్షుల కిలకిలలు..నుంచి కోతుల గెంతులు..చిరుతల ఉరుకులు..మృగరాజులు గర్జనలు..గజరాజుల సందళ్లు ఇలా ఒకటా రెండా జూలో వినోదాలకు కొరతే లేదు. రికాక్స్ అవ్వాంటే హైదరాబాద్ వాసులు నెహ్రూ జులాజిక్ పార్క్ కు పరుగులు తీస్తారు. మది నిండా ఆహ్లాదాన్ని నింపుకుంటారు. కానీ ఇక నుంచి ఆ ఆహ్లాదాన్ని ఆస్వాదించాలంటే గతం కంటే కాస్తంత ఎక్కువే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
Read Also : బీభత్సం : పూతలపట్టు వైసీపీ అభ్యర్థి బాబుపై దాడి

 ఎందుకంటే ఇప్పుడు జూ పార్క్ టిక్కెట్స్ రేట్లు పెరిగాయి. పెరిగిన ఈ ధరలు శుక్రవారం (ఏప్రిల్ 12) నుంచి అమలులోకి రానున్నాయి. నిర్వహణలో భాగంగా ప్రతి సంవత్సరం వలెనే ఈసారి కూడా టికెట్ ధరలపై 5 శాతం పెంచారు. ఈ ధరలు రేపటి నుంచి అమలవుతాయని జూపార్క్ క్యూరేటర్ తెలిపారు. 
కాగా..వీకెండ్స్ (శని, ఆదివారాల్లో)ను..ప్రభుత్వ సెలవు రోజుల్లో పార్కుకు వచ్చే సందర్శకుల కోసం వాష్‌రూమ్, ఫోసిల్ మ్యూజియం, యానిమల్ హౌజ్, ఫిష్ ఆక్వేరియం సందర్శనలకు ఉచితంగా అనుమతి ఇవ్వనున్నామని తెలిపారు. 

మంగళవారం నుంచి శుక్రవారం వరకూ, శని, ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో ఉండే ధరలు ఇలా ఉన్నాయి. 
వయస్సు ప్రవేశరుసుం వీకెండ్ ప్రభుత్వ సెలవు దినాల్లో

  • పెద్దలకు    రూ.40    రూ.50    రూ.60
  • పిల్లలకు (10సం)    రూ. 25    రూ.50    రూ.40
  • స్టిల్ కెమెరా అనుమతికి రూ.30    రూ.100    
  • వీడియో కెమెరా రూ.120    రూ.500    

బ్యాటరీ ఆపరేట్ వెహికిల్

  • పెద్దలకు    రూ.60    రూ.70    రూ.80
  • పిల్లలకు    రూ.40    రూ.40    రూ.50

యానిమల్ హౌజ్    

  • పెద్దలకు    రూ.10    రూ.50    రూ.60    
  • పిల్లలకు    రూ.30    రూ.50    రూ.60 

సఫారీ పార్కు 

  • పెద్దలకు    రూ.50    రూ.50    రూ.60
  • పిల్లలకు    రూ.30    రూ.50    రూ.60
  • ఏసీ సఫారీ బస్    రూ.80    రూ.100 

టాయ్ ట్రైన్    

  • పెద్దలకు రూ.20    రూ.20    రూ.30
  • పిల్లలకు రూ.10    రూ.20    రూ.30

Read Also : తలపై లేజర్ లైట్ : రాహుల్ కు ప్రాణహాని..హోంశాఖకు కాంగ్రెస్ లేఖ