నీళ్లు లేవ్..: నిమ్స్‌‌లో నో ఆపరేషన్స్

హైదరాబాద్‌ నిమ్స్‌లో నీళ్లు లేవని ఆపరేషన్లు ఆపేశారు. నీటి సరఫరా నిలిచిపోయిందని, అందుకే ఆపరేషన్లు అన్నీ నిలిపివేయాలని ఆస్పత్రి సూపరిండెంట్ ఆదేశాలు జారీ చేశారు.

  • Published By: veegamteam ,Published On : October 18, 2019 / 08:06 AM IST
నీళ్లు లేవ్..: నిమ్స్‌‌లో నో ఆపరేషన్స్

హైదరాబాద్‌ నిమ్స్‌లో నీళ్లు లేవని ఆపరేషన్లు ఆపేశారు. నీటి సరఫరా నిలిచిపోయిందని, అందుకే ఆపరేషన్లు అన్నీ నిలిపివేయాలని ఆస్పత్రి సూపరిండెంట్ ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్‌ నిమ్స్‌లో నీళ్లు లేవని ఆపరేషన్లు ఆపేశారు. గోదావరి పైప్‌లైన్ల మరమ్మతులు చేస్తున్న కారణంగా నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ కారణంగానే ఆపరేషన్లు అన్నీ నిలిపివేయాలని ఆస్పత్రి సూపరిండెంట్ ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల పాటు నీటి కొరత ఉంటుందని, అప్పటికీ కొత్తకేసుల అడ్మిషన్ తీసుకోకూడదని, పేషెంట్లలో కూడా వీలైనంత వరకు డిశ్చార్జ్‌ చేయాలని సూచించారు. 

నీటి ఎద్దడి ఉంటే ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు.. ఏకంగా ఎమర్జెన్సీ ఆపరేషన్లను నిలిపివేయడంపై పేషెంట్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్‌బోర్డు వారితో చర్చించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నారు రోగుల బంధువులు. ఎక్కువగా ప్రజాప్రతినిధులు చికిత్స కోసం వచ్చే నిమ్స్‌ ఆస్పత్రిలో నీటి సమస్య కారణంతో ఎమర్జెన్సీ ఆపరేషన్లు నిలిపివేయడం చర్చనీయాంశమైంది.