ఓయూ హాస్టళ్లు మూసివేత, వెళ్లిపోవాలని విద్యార్థులకు ఆదేశాలు

హైదరాబాద్ లోని ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీపైనా కరోనా ప్రభావం పడింది. కరోనా కట్టడిలో భాగంగా ఓయూ వర్సిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 02:26 AM IST
ఓయూ హాస్టళ్లు మూసివేత, వెళ్లిపోవాలని విద్యార్థులకు ఆదేశాలు

హైదరాబాద్ లోని ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీపైనా కరోనా ప్రభావం పడింది. కరోనా కట్టడిలో భాగంగా ఓయూ వర్సిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా

హైదరాబాద్ లోని ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీపైనా కరోనా ప్రభావం పడింది. కరోనా కట్టడిలో భాగంగా ఓయూ వర్సిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా ప్రభావంతో మార్చి 31వ వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అందుకనుగుణంగా ఓయూ అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అందరూ హాస్టళ్లను ఖాళీ చేయాలని సూచించారు. హాస్టళ్లకు మంచి నీరు, విద్యుత్‌ సరఫరాను మంగళవారం(మార్చి 17,2020) నుంచి నిలిపివేయనున్నట్లు తెలిపారు. 

See Also | కరోనా మహమ్మారి : ప్రపంచ వ్యాప్తంగా 7 వేలకుపైగా మృతి…ఇటలీలోనే 3,240 మంది మృత్యువాత

హాస్టల్స్ ఖాళీ చేయాలని విద్యార్థులకు ఆదేశాలు:
హాస్టల్స్ ఖాళీ చేయాలని విద్యార్థులకు ఆదేశాలు ఇచ్చారు. ఏ ఒక్కరు కూడా హాస్టల్‌లో ఉండటానికి వీలు లేదని, వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. అటు.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మాత్రం విద్యార్థులు వసతి గృహాల్లో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి చదువుకోవడానికి ఇక్కడి వచ్చారని, ఉన్నఫలంగా వాళ్లను ఖాళీ చేయాలని కోరితే ఇబ్బంది పడతారని కొన్ని నిబంధనలతో అనుమతి ఇచ్చారు.

రద్దీ ప్రదేశాల్లో తిరగొద్దని విజ్ఞప్తి:
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. రద్దీ ప్రదేశాల్లో తిరగొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, పర్యాటక ప్రదేశాలు, రెస్టారెంట్లు, బార్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. అటు.. కొన్ని పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విద్యార్థులకు మార్చి 31 వరకు సెలవులు ఇచ్చారు. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా విద్యార్థులకు సెలవులు ఇచ్చేసింది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా హాస్టళ్లు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.