Khairatabad ganpati: ఖైరతాబాద్ గణేశ విగ్రహం వద్ద రాజాసింగ్ అనుచరుల ఆందోళన.. ఉద్రిక్తత

ఖైరతాబాద్ గణేశ విగ్రహం వద్ద గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచరులు, మద్దతుదారులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన రాజాసింగ్‌ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గణేశ్ విగ్రహం వద్ద ఆయన అనుచరులు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. రాజాసింగ్ ను విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ఆరుగురు యువకులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

Khairatabad ganpati: ఖైరతాబాద్ గణేశ విగ్రహం వద్ద రాజాసింగ్ అనుచరుల ఆందోళన.. ఉద్రిక్తత

khairatabad ganpati

Khairatabad ganpati: ఖైరతాబాద్ గణేశ విగ్రహం వద్ద గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచరులు, మద్దతుదారులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన రాజాసింగ్‌ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గణేశ్ విగ్రహం వద్ద ఆయన అనుచరులు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. రాజాసింగ్ ను విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ఆరుగురు యువకులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

రాజాసింగ్ పై మొత్తం కలిపి 101 కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఓ మతాన్ని కించపరిచేలా వాఖ్యలు చేసినందుకు 18 కేసులు నమోదయ్యాయి. పీడీ యాక్ట్ నమోదు చేస్తే మూడు నెలల వరకు ఎలాంటి బెయిల్ మంజూరు కాదు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ మద్దతుదారులు నిరసనలు తెలుపుతున్నారు. ఇవాళ వినాయక చవితి కావడంతో పలువురు నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని చూడడానికి వస్తున్నారు. ఈ సమయంలో అక్కడ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచరులు ఆందోళనకు దిగడం కలకలం రేపింది.

COVID-19: దేశంలో కొత్తగా 7,231 కరోనా కేసులు.. నిన్న 22,50,854 వ్యాక్సిన్ డోసుల వినియోగం