మద్దతివ్వండి ప్లీజ్ : రేవంత్ రెడ్డి సొంత ప్రయత్నాలు

మద్దతివ్వండి ప్లీజ్ : రేవంత్ రెడ్డి సొంత ప్రయత్నాలు

మద్దతివ్వండి ప్లీజ్ : రేవంత్ రెడ్డి సొంత ప్రయత్నాలు

లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ ప్రజాకూటమి తెరపైకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. 17 లోక్ సభ నియోజకవర్గాలకు కాకుండా కేవలం మల్కాజ్ గిరిపైనే ఈ కూటమి ఫోకస్ పెట్టింది. మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి బరిలో నిలిచిన రేవంత్ రెడ్డి ఇతర పార్టీల మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీతో సంబంధం లేకుండా సొంతంగా రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు. పలు పార్టీల పెద్దలను కలుస్తున్నారు రేవంత్. కాంగ్రెస్ కోసం జనసమితి పోటీ నుండి తప్పుకుంది. ఇప్పటికే సీపీఐ మద్దతు ప్రకటించింది.
Read Also : సెంటిమెంట్: ముహూర్తాలు చూస్తున్న అభ్యర్దులు

ఇక టీడీపీ స్పందించాల్సి ఉంది. నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయినా టీడీపీ నుండి ఎలాంటి ప్రకటన రావడం లేదు. ఈ ఎన్నికల్లో టీడీపీ దూరమనే సంకేతాలు కనబడుతున్నాయి. టీడీపీ బరిలో నిలిస్తే సెటిలర్ల ఓట్లు చీలిపోయే ఛాన్స్ ఉందని పలువురు భావిస్తున్నారు. 

మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు కీలకం కానున్నాయి. 2014 సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లారెడ్డి విజయం సాధించారు. 
Read Also : బీజేపీ ఫస్ట్‌లిస్ట్: 123 మంది అభ్యర్థులు వీళ్లే

×