సెప్టెంబర్ 8న తెలంగాణ కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే. 2019, సెప్టెంబర్ 8వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆమె తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : September 4, 2019 / 03:07 AM IST
సెప్టెంబర్ 8న తెలంగాణ కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే. 2019, సెప్టెంబర్ 8వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆమె తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర నూతన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతంగిరి నియామకపత్రం అందజేశారు. చెన్నైలోని ఆమె నివాసంలో అపాయింట్ మెంట్ లెటర్ ను అందించారు. ఈ సందర్భంగా కొత్త గవర్నర్ కు వేదాంతంగిరి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గవర్నర్‌ గా బాధ్యతలు దక్కడంపై సౌందరరాజన్ సంతోషం వ్యక్తం చేశారు. 2019, సెప్టెంబర్ 8వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆమె తెలిపారు.

బీజేపీ తమిళనాడు ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమెకు కేంద్రం గవర్నర్ గా అవకాశం కల్పించింది. తమిళసై సౌందర్య రాజన్ వృత్తిరిత్యా డాక్టర్. తమిళనాడు కన్యకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో పుట్టారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో సౌందర్ రాజన్ ఎంబీబీఎస్ చదివారు. ఆ సమయంలో విద్యార్థి సంఘం నేతగా కూడా పనిచేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా ఆమె పనిచేశారు.  ఇప్పటివరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లుగా ఎంపీగా పోటీ చేసిన ఆమె ఒక్కసారి కూడా గెలవలేదు. 

మొన్నటివరకు రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్‌గా ఉన్న నరసింహన్ తెలంగాణ గవర్నర్ గా మారగా.. ఆయనను తొలగించి సౌందర్యరాజన్ ను తెలంగాణ గవర్నర్ గా నియమించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్‌గా సరికొత్త రికార్డు నమోదు చేశారు నరసింహన్. రెండు రాష్ట్రాల తొలి ప్రభుత్వాలకు పూర్తి కాలం గవర్నర్‌గా పనిచేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏకంగా ఆరుగురితో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన నరసింహన్, 2010 నుంచి 2019 వరకు గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు.