AAP vs BJP: ‘మీరే అవినీతికి పాల్పడ్డారు’.. అంటూ గత రాత్రంతా అసెంబ్లీ వద్ద పోటాపోటీగా ఆప్, బీజేపీ ఎమ్మెల్యేల నిరసనలు

ఢిల్లీ అసెంబ్లీ వద్ద గత రాత్రంతా పోటాపోటీగా ఆప్, బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనలు తెలిపారు. ‘అవినీతికి పాల్పడింది మేము కాదు మీరే’ అంటూ ఇరు పార్టీల ఎమ్మెల్యేలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఉంటే మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కూర్చొని నిరసనలు తెలపగా, బీజేపీ ఎమ్మెల్యేలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ విగ్రహాల వద్ద కూర్చొని ఆందోళన తెలిపారు.

AAP vs BJP: ‘మీరే అవినీతికి పాల్పడ్డారు’.. అంటూ గత రాత్రంతా అసెంబ్లీ వద్ద పోటాపోటీగా ఆప్, బీజేపీ ఎమ్మెల్యేల నిరసనలు

AAP vs BJP

AAP vs BJP: ఢిల్లీ అసెంబ్లీ వద్ద గత రాత్రంతా పోటాపోటీగా ఆప్, బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనలు తెలిపారు. ‘అవినీతికి పాల్పడింది మేము కాదు మీరే’ అంటూ ఇరు పార్టీల ఎమ్మెల్యేలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ఉంటే మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కూర్చొని నిరసనలు తెలపగా, బీజేపీ ఎమ్మెల్యేలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ విగ్రహాల వద్ద కూర్చొని ఆందోళన తెలిపారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని, ఆయన రాజీనామా చేయాలని ఆప్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. 2016లో ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ చైర్మన్ గా ఉన్న సక్సేనా రద్దు చేసిన రూ.1,400 కోట్లను మార్పించి కొత్త నోట్లు తీసుకురావాలంటూ తన ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు వచ్చారని చెప్పారు. దీనిపై కేంద్ర దర్యాప్తు బృందం విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.

అలాగే, ఆయనను పదవి నుంచి తొలగించాలని అన్నారు. ఇంతకుముందు సక్సేనా పనిచేసిన ప్రదేశాల్లో సీబీఐ, ఈడీ అధికారులు దాడులు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు అన్నారు. ఆయనపై మద్యం పాలసీలో ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసిందని అన్నారు. ఢిల్లీలో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు.

Purification ritual after Siddaramaiah’s visit: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సందర్శించిన ఆలయాన్ని శుద్ధి చేసిన సిబ్బంది