COVID-19 update: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా.. కొత్తగా 12,608 కేసులు నమోదు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 12,608 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 16,251 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,01,343 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉందని చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.20 శాతం ఉన్నట్లు తెలిపింది. రికవరీ రేటు ప్రస్తుతం 98.58 శాతంగా ఉందని పేర్కొంది.

COVID-19 update: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా.. కొత్తగా 12,608 కేసులు నమోదు

COVID-19 update

COVID-19 update: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 12,608 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 16,251 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,01,343 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉందని చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.20 శాతం ఉన్నట్లు తెలిపింది. రికవరీ రేటు ప్రస్తుతం 98.58 శాతంగా ఉందని పేర్కొంది.

ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,36,70,315కు చేరిందని వివరించింది. కరోనా వల్ల ఇప్పటివరకు మొత్తం 5,27,206 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 208.95 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను వేశామని పేర్కొంది. అందులో 93.86 కోట్లు రెండవ డోసు, 12.92 కోట్లు బూస్టర్ డోసులు ఉన్నాయని వివరించింది.

గత 24 గంటల్లో 38,64,471 డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నట్లు చెప్పింది. దేశంలో నిన్న 3,62,020 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు చేసిన కరోనా పరీక్షల సంఖ్య 88.14 కోట్లకు చేరిందని వివరించింది. కాగా, కొన్ని రోజులుగా ఢిల్లీలో మాత్రమే కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

Kabul mosque attack: అఫ్గాన్‌లో బాంబు పేలుళ్ళు.. 20 మంది మృతి.. 40 మందికి గాయాలు