Rajnath Singh: అందుకే నేను ఆర్మీలో చేరలేకపోయాను: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

భారత ఆర్మీలో చేరాలనుకున్న తాను కుటుంబ పరిస్థితుల కారణంగా తన కలను సాకారం చేసుకోలేకపోయానని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. మణిపూర్ లోని ఇంపాల్ భారతీయ ఆర్మీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ‘నా చిన్ననాటి కథను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆర్మీలో చేరాలని నేను కూడా అనుకున్నాను.. షార్ట్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షకు హాజరయ్యాను. కానీ, మా కుటుంబ పరిస్థితులు, మా నాన్న మరణం వల్ల నేను ఆర్మీలో చేరలేకపోయాను’ అని వ్యాఖ్యానించారు.

Rajnath Singh: అందుకే నేను ఆర్మీలో చేరలేకపోయాను: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

Rajnath Singh

Rajnath Singh: భారత ఆర్మీలో చేరాలనుకున్న తాను కుటుంబ పరిస్థితుల కారణంగా తన కలను సాకారం చేసుకోలేకపోయానని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. మణిపూర్ లోని ఇంపాల్ భారతీయ ఆర్మీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ‘నా చిన్ననాటి కథను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆర్మీలో చేరాలని నేను కూడా అనుకున్నాను.. షార్ట్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షకు హాజరయ్యాను. కానీ, మా కుటుంబ పరిస్థితులు, మా నాన్న మరణం వల్ల నేను ఆర్మీలో చేరలేకపోయాను’ అని వ్యాఖ్యానించారు.

‘ఎవరైనా ఓ చిన్నారికి ఆర్మీ యూనిఫాం ఇచ్చి చూడండి. వారి వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. ఆ యూనిఫాంలో కరిజ్మా ఉంది. భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియవు. కానీ, మన జవాన్లు ఎంతటి ధైర్యాన్ని ప్రదర్శించారో నాకు, అప్పటి ఆర్మీ చీఫ్ కు తెలుసు. మన దేశం మీకు రుణపడి ఉంది’ అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. తాను దేశంలోకి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆర్మీని కలుస్తున్నానని చెప్పారు.

Janmashtami: లండన్‌లో భార్యతో కలిసి గుడికి వెళ్ళిన రిషి సునక్.. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నానని ట్వీట్