AstraZeneca: ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ వల్ల ‘బ్లడ్ కాటింగ్’ ముప్పు అధికం.. పరిశోధనలో వెల్లడి

రోనా వ్యాక్సిన్ ఫైజర్‌తో పోల్చితే ఆస్ట్రాజెనెకా (భారత్‌లో కొవిషీల్డ్‌) వ్యాక్సిన్ వల్ల చాలా అరుదైన బ్లడ్ కాటింగ్ (రక్తం గడ్డకట్టడం) సమస్యలు తలెత్తే ముప్పు 30 శాతం అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. అడెనోవైరస్ వెక్టర్, జన్యుమార్పిడి వంటి పద్ధతుల ద్వారా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న కొందరిలో థ్రాంబోసిస్ (రక్తం గడ్డకట్టడం)తో కూడిన థ్రోంబోసైటోపెనియా (ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉండడం) సిండ్రోమ్-టీటీఎస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇప్పటికే పరిశోధనలో గుర్తించారు. ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లను ఆ పద్ధతుల్లోనే అభివృద్ధి చేశారు.

AstraZeneca: ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ వల్ల ‘బ్లడ్ కాటింగ్’ ముప్పు అధికం.. పరిశోధనలో వెల్లడి

AstraZeneca

AstraZeneca: కరోనా వ్యాక్సిన్ ఫైజర్‌తో పోల్చితే ఆస్ట్రాజెనెకా (భారత్‌లో కొవిషీల్డ్‌) వ్యాక్సిన్ వల్ల చాలా అరుదైన బ్లడ్ కాటింగ్ (రక్తం గడ్డకట్టడం) సమస్యలు తలెత్తే ముప్పు 30 శాతం అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. అడెనోవైరస్ వెక్టర్, జన్యుమార్పిడి వంటి పద్ధతుల ద్వారా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న కొందరిలో థ్రాంబోసిస్ (రక్తం గడ్డకట్టడం)తో కూడిన థ్రోంబోసైటోపెనియా (ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉండడం) సిండ్రోమ్-టీటీఎస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇప్పటికే పరిశోధనలో గుర్తించారు. ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లను ఆ పద్ధతుల్లోనే అభివృద్ధి చేశారు.

ఎంఆర్ఎన్ఏ సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చేసిన ఫైజర్ వంటి వ్యాక్సిన్లను అడెనోవైరస్ వెక్టర్ ద్వారా రూపొందించిన వ్యాక్సిన్ల మధ్య భేదాలను గుర్తిస్తూ తొలిసారి ఈ పరిశోధన చేశారు. పలు దేశాల నుంచి సమాచారం తీసుకుని ఈ పరిశోధనలు కొనసాగించారు. 2020 డిసెంబరు నుంచి 2021 జూలై మధ్య కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేయించుకున్న ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, యూకే, అమెరికా వంటి దేశాల్లోని కోటి మందికి పైగా ప్రజల నుంచి వివరాలు సేకరించారు.

జర్మనీ, యూకేల్లో ఆస్ట్రాజెనెకా మొదటి డోసు తీసుకున్న 13 లక్షల మంది, ఫైజర్ మొదటి డోసు తీసుకున్న 21 లక్షల మంది ఆరోగ్య వివరాలను పోల్చి చూశారు. ఆస్ట్రాజెనెకా తీసుకున్న 28 రోజుల్లో 862 మందిలో థ్రోంబోసైటోపెనియా కేసులను గుర్తించామని పరిశోధకులు చెప్పారు. అదే సమయంలో ఫైజర్ తీసుకున్న వారిలో 520లో థ్రోంబోసైటోపెనియా గుర్తించినట్లు వివరించారు. అంటే, ఫైజర్ తీసుకున్న వారి కంటే ఆస్ట్రాజెనెకా తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా ముప్పు 30 శాతం అధికంగా ఉందని తేలినట్లు చెప్పారు.

రెండో డోసు తీసుకున్న వారిలో అదనంగా ఏ ముప్పూ లేదని తేలినట్లు వివరించారు. అయితే, వ్యాక్సిన్లు అన్నీ సురక్షితమేనని, ప్రభావవంతమైనవేనని యూకేలోని బ్రైటన్ విశ్వవిద్యాలయం మైక్రోబయాలజిస్ట్ సారా పిట్ చెప్పారు. ఆమె పరిశోధన బృందంలో లేరు. జర్మనీ, యూకేల్లో వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కేవలం 0.04 మందిలో మాత్రమే థ్రోంబోసైటోపెనియా కనపడిందని వివరించారు. ఇప్పటికే చాలా దేశాలు అడెనోవైరస్ కరోనా వ్యాక్సిన్లను వృద్ధులకు, చిన్నారులకు ఇవ్వట్లేదని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..