Twin Kabul Blasts : కాబూల్‌లో ఆత్మాహుతి దాడి ఐసిస్ పనే!

కాబూల్ ఎయిర్ పోర్టు గేటు దగ్గర జంట ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఆత్మాహుతి దాడి ఐసిస్ పనేనని అమెరికా అంటోంది. అలాగే తాలిబన్లు కూడా అదే మాట అంటున్నారు.

Twin Kabul Blasts : కాబూల్‌లో ఆత్మాహుతి దాడి ఐసిస్ పనే!

13 Dead In Twin Kabul Blasts, Says Taliban; Suicide Attack Suspected

Twin Kabul Blasts : కాబూల్ ఎయిర్ పోర్టు గేటు దగ్గర జంట ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఆత్మాహుతి దాడి ఐసిస్ పనేనని అమెరికా అంటోంది. అలాగే తాలిబన్లు కూడా అదే మాట అంటున్నారు. ఎయిర్ పోర్టు పశ్చిమ గేటు ముందు గురువారం రాత్రి 7.15 గంటలకు మొదటి ఆత్మాహుతి దాడి జరిగింది. బరోన్ హోటల్ వద్ద రాత్రి 8.03 నిమిషాలకు రెండో ఆత్మాహుతి దాడి జరిగింది. రెండు పేలుళ్లకు మధ్యలో 47 నిమిషాల సమయం ఉంది. ఈ పేలుడులో 13 మంది విదేశీ సైనికులకు గాయాలయ్యాయి.

విదేశీ సైనికుల్లో ఐదు మంది అమెరికా సైనికులు ఉన్నారు. మృతుల సంఖ్య 13కు చేరింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఆత్మాహుతి దాడి ఘటనను పెంటగాన్ ధ్రువీకరించింది. జనం మధ్యలోకి వెళ్లి ఉగ్రవాది పేల్చుకోవడంతో చెల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయాయి. రెండో పేలుడు కూడా జరిగినట్టు టర్కీ ప్రకటించింది. మరో ఆత్మాహుతి దాడి జరగొచ్చునని ఫ్రాన్స్ హెచ్చరించింది. దాడి సమయంలో ఎయిర్ పోర్టు వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నారు. కాబూల్ ఎయిర్ పోర్టునే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.

ఉగ్రదాడులు జరగొచ్చుని ఉదయమే అమెరికా హెచ్చరించింది. ఐసిస్ దాడులకు తెగబడొచ్చునని యూఎస్, యూకేలు కూడా హెచ్చరించాయి. ఆత్మాహుతి దాడి ఘటనతో యూఎస్ ఆర్మీ అప్రమత్తమైంది.  ఎయిర్ పోర్టు ప్రాంతాన్ని ఖాళీ చేయాలని యూఎస్ ఆర్మీ హెచ్చరించింది. ఆత్మాహుతి దాడికి ముందు ఇటాలియన్ జెట్ విమానంపై కాల్పులు జరిపారు. విమానం టేకాఫ్ సమయంలో ఉగ్రవాదులు ఈ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. 11 మంది విదేశీ సైనికులు సహా 50 మందికి గాయాలయ్యాయి. ఆత్మాహుతి దాడిలో గాయపడిన వారిని అమెరికా సైన్యం ఆస్పత్రికి తరలించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ లో ఎయిర్ పోర్ట్ కి సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని అబ్బే గేట్ దగ్గర భారీ పేలుడు సంభవించిందని పెంటగాన్(అమెరికా రక్షణమంత్రిత్వశాఖ కార్యాలయం)మీడియా సెక్రటరీ జాన్ కిర్బే ఓ ట్వీట్ లో తెలిపారు.

ఇక,ఈ పేలుడు ఘటనలో ముగ్గురు అమెరికా సైనికులు సహా పలువురు అప్ఘానీయులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పేలుడు జరిగిన ప్రదేశంలో తాలిబన్లు కాల్పులు కూడా జరిపినట్లు సమాచారం. అయితే ఈ పేలుడు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, భారత్ సహా పలుదేశాలు అప్ఘానిస్తాన్ లోని కాబూల్ ఎయిర్ పోర్ట్ నుంచి తమ తమ దేశాల పౌరులను స్వదేశాలకు తరలిస్తున్న సమయంలో ఈ పేలుడు ఘటన కలకలం రేపుతోంది.