Covid Vaccine: పొరపాటున కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేశారు.. ఆసుపత్రిపాలైన శిశువులు

బ్రెజిల్‌లోని ఇద్దరు శిశువులకు పొరపాటున కరోనావైరస్ వ్యాక్సిన్ షాట్లు ఇచ్చేశారు ఆరోగ్య అధికారి.

Covid Vaccine: పొరపాటున కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేశారు.. ఆసుపత్రిపాలైన శిశువులు

Vaccine

Covid Vaccine to Newborn Babies: బ్రెజిల్‌లోని ఇద్దరు శిశువులకు పొరపాటున కరోనావైరస్ వ్యాక్సిన్ షాట్లు ఇచ్చేశారు ఆరోగ్య అధికారి. డిఫ్తీరియా, టెటానస్ (లాక్‌జా), పెర్టుస్సిస్ (కోరింత దగ్గు), హెపటైటిస్-బి కి ఇచ్చే ఇమ్యునైజింగ్ టీకాకు బదులుగా రెండు నెలల బాలిక, నాలుగు నెలల బాలుడికి COVID-19 ఫైజర్ షాట్ ఇచ్చారు.

ఫైజర్ వ్యాక్సిన్ ఇద్దరు శిశువులలో తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. తప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్న శిశువులు ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది. వ్యాక్సిన్‌లు వేసిన నర్సును సస్పెండ్ చేశారు అధికారులు.

ఈ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ చేపట్టింది. అనేక దేశాలలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ వేసేందుకు ఇప్పటికే ఆమోదం తెలిపారు.

బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్, అన్విసా, జూన్‌లో 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్/బయోఎన్‌టెక్ COVID-19 వ్యాక్సిన్‌ను ఆమోదించింది.