23 ఏళ్ల యువకుడ్ని వివాహం చేసుకున్న 65 ఏళ్ల మహిళ

23 ఏళ్ల యువకుడ్ని వివాహం చేసుకున్న 65 ఏళ్ల మహిళ

Abdullah of Pakistan : ప్రేమకు వయస్సు అడ్డు కానే కాదు.. అది ఎప్పుడు ఎక్కడ ఎవరిమీద ఎందుకు పుడుతుందో చెప్పలేం. పెళ్లి చేసుకొనే విషయంలో  వయస్సు అడ్డు ఉండదని కొందరు నిరూపిస్తున్నారు. తక్కువ వయస్సున్న వారిని వివాహమాడుతున్నారు. ఎక్కువ వయస్సున్న పురుషులు చిన్న వయస్సు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే అదో సాధారణ విషయంగా చూసే సమాజం (అది ఏదేశంలో అయినా సరే) పెద్ద వయస్సు మహిళలు చిన్నవయస్సు అబ్బాయిల్ని వివాహం చేసుకుంటునే మాత్రం అదొక సంచలనం..అదో పెద్ద వార్త..అంటూ వైరల్ చేసేస్తుంటారు.  ఇది కూడా అటువంటిదే. పాకిస్తాన్ లో  65 ఏళ్ల మహిళ..23 ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఏంటా కథంటే..
23 ఏళ్ల అబ్దుల్లా.. Gunjarawala లోని Varpal Chhataలో నివాసం ఉంటున్నాడు. వృత్తిపరంగా చిత్రకారుడు. చెక్ రిపబ్లిక్ లో ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటాడు. ఫేస్ బుక్ లో అరియానా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. రెండేళ్ల పాటు..జరిగిన పరిచయం..కాస్తా ప్రేమగా మారింది. అతనికంటే..ఆ మహిళ 42 సంవత్సరాలు పెద్దది. ఇరువురి పెద్దలను ఒప్పించి పెళ్లికి లైన్ క్లియర్ చేసుకున్నారు.

పాక్ రాయబార కార్యాలయం :-
కానీ..గత సంవత్సరం నుంచి వీసా కోసం అరియాన ప్రయత్నిస్తోంది. అయితే..అధికారులు ఆమె వీసాను తిరస్కరిస్తూ వచ్చారు. అబ్దుల్లా కూడా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇతని వీసాకు కూడా నో చెప్పారు. అనేక ఫోన్స్ కాల్స్ తర్వాత..చెక్ రిపబ్లిక్ దేశంలోని పాక్ రాయబార కార్యాలయాన్ని అరియాన సంప్రదించారు. చివరకు పాక్ రాయబార కార్యాలయం సహాయపడడంతో మూడు సంవత్సరాల తర్వాత..వీరిద్దరూ కలుసుకున్నారు.

చెక్ రిపబ్లిక్ :-
వివాహం చేసుకున్న వీరు..చెక్ రిపబ్లిక్ లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రిటైర్స్ స్కూల్ టీచర్ గా ఉన్న అరియానా..అబ్దుల్లాకు ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం చేస్తోంది. కానీ..కొత్త జీవితంలోకి మూడో వ్యక్తికి వెల్ కమ్ చెప్పాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే..వైద్యులు మాత్రం నో అంటున్నారంట. అరియానా వయస్సు రీత్యా అలా చేయవద్దని సలహా ఇస్తున్నారంట.