China Population : నూతన జంటలకు 30 రోజులు సెలవులు.. జననాల రేటును పెంచుకొనేందుకు చైనా సరికొత్త ప్రయోగాలు ..

చైనాలో జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాలను అవలంభిస్తోంది. తాజాగా కొన్ని చైనా ప్రావిన్స్‌లు వివాహాలను ప్రోత్సహిస్తూ, జననాల రేటును పెంచాలనే ఉద్దేశంతో కొత్తగా పెళ్లియిన యువతీ, యువకులకు 30రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నాయి.

China Population : నూతన జంటలకు 30 రోజులు సెలవులు.. జననాల రేటును పెంచుకొనేందుకు చైనా సరికొత్త ప్రయోగాలు ..

paid marriage leave in china

China Population : చైనా జనాభాను పెంచుకొనేందుకు సరికొత్త ప్రయోగాలను అనుసరిస్తుంది. గత కొన్నేళ్లుగా చైనా జనాభా తగ్గుతూ వస్తోంది. ఆరు దశాబ్దాలలో తొలిసారి గతేడాది చైనాలో అత్యల్ప జనన రేటను నమోదు చేసింది. వెయ్యి మందికి 6.77 జననాలు జరిగాయి. 1980 నుంచి 2015 మధ్య విధించిన ఒక బిడ్డ విధానం, విద్య ఖర్చుల పెరుగుదల ఫలితంగా చాలా వరకు జనాభా నియంత్రణ జరిగింది. చైనీయులు ఒక్కరే ముద్దు అనే నినాదంతో పిల్లలను కలిగి ఉన్నారు. కొందరు పిల్లలను కనడమే మానేశారు. ఫలితంగా చైనా జనాభా గణనీయంగా తగ్గింది. తాజాగా చైనాలో జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది.

CHINA Population fall : భారీ స్థాయిలో తగ్గిపోతున్న చైనా జనాభా.. 61 ఏళ్లలో ఇదే మొదటిసారి

చైనాలో జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాలను అవలంభిస్తోంది. తాజాగా కొన్ని చైనా ప్రావిన్స్‌లు వివాహాలను ప్రోత్సహిస్తూ, జననాల రేటును పెంచాలనే ఉద్దేశంతో కొత్తగా పెళ్లి అయిన యువతీ, యువకులకు 30రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ మౌత్ పీస్ పీపుల్స్ డైలీ హెల్త్ తెలిపింది. చైనాలో సాధారణంగా వివాహం చేసుకుంటే మూడు రోజులే సెలవులు ఇస్తారు. కానీ ఫిబ్రవరి నుంచి కొన్ని ప్రావిన్సుల్లో 30 రోజులు సెలవులు ఇవ్వడంతో పాటు, ఆ నెల జీతం కూడా చెల్లిస్తున్నారు.

China Population : చైనాలో వేగంగా తగ్గిపోతున్న జనాభా..ఫలితంగా..రోజు రోజు పడిపోతున్న ఉత్పాదక శక్తి

యువ జంటలను వివాహం చేసుకోవడానికి, వారు పిల్లలను కలిగి ఉండటానికి ప్రోత్సాహంలో భాగంగా యువ జంటలకు 30రోజులు సెలువులు ఇస్తున్నట్లు స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. అయితే, చైనాలోని కొన్ని ప్రావిన్సుల్లో వివాహానికి 30 రోజుల సెలవు ఇస్తుండగా, కొన్ని ప్రావిన్సుల్లో 10 రోజులు మాత్రమే సెలవులు ఇస్తున్నారు. గన్సు, షాంగ్సీ ప్రావిన్సుల్లో వివాహ సెలవులు 30 రోజులు ఇస్తుండగా, షాంఘై ప్రావిన్సులో 10 రోజులు మాత్రమే ఇస్తున్నారు. ఇక, సిచువాన్ ప్రావిన్సులో ఇప్పటికీ మూడు రోజుల సెలవుల విధానం మాత్రమే అమల్లో ఉంది.