Solar Storm : సౌర తుఫాన్ ఎఫెక్ట్.. గాలిలోనే మండిపోయిన 40 ఉపగ్రహాలు

శుక్రవారం నాటి జియోమాగ్నటిక్‌ తుఫాన్ల దెబ్బకు వాతావరణ సాంద్రత పెరగడంతో దాని ప్రభావం గతవారం ప్రయోగించిన శాటిలైట్లపై పడింది.

Solar Storm : సౌర తుఫాన్ ఎఫెక్ట్.. గాలిలోనే మండిపోయిన 40 ఉపగ్రహాలు

Rocket

solar storm effect : సౌర తుఫాన్లు స్పేస్ ఎక్స్‌కు భారీ డ్యామేజ్ చేశాయి. గత వారం ప్రయోగించిన కొత్త వాటిలో దాదాపు 40కిపైగా శాటిలైట్లు తమ కక్ష్యల నుంచి జారి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయినట్టు స్పేస్‌ ఎక్స్‌ ప్రకటించింది. గత వారం ప్రయోగించిన వీటిలో చాలావరకు తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయాయి. మిగతావీ కూడా అదే బాటలో ఉన్నాయంటూ స్పేస్ ఎక్స్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

శుక్రవారం నాటి జియోమాగ్నటిక్‌ తుఫాన్ల దెబ్బకు వాతావరణ సాంద్రత పెరగడంతో.. దాని ప్రభావం గతవారం ప్రయోగించిన ఈ శాటిలైట్లపై పడింది. ఒక్కోటీ కేవలం 260 కిలోలుండే ఈ చిన్న శాటిలైట్లను కాపాడేందుకు గ్రౌండ్‌ కంట్రోలర్లు ఎంతగా ప్రయత్నించినా లాభం లేకపోయిందని స్పేస్ ఎక్స్ స్పష్టం చేసింది. స్పేస్‌ ఎక్స్‌కు చెందిన సుమారు రెండు వేల స్టార్‌ లింక్‌ శాటిలైట్లు దాదాపు 550 కిలోమీటర్ల ఎత్తులో భూమికి చుట్టూ తిరుగుతూ ప్రపంచంలోని మారుమూలలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సమకూరుస్తున్నాయి.

CM Jagan-Chiru : సినిమా టికెట్ రేట్లు, థియేటర్లలో షోలపై కమిటీ కీలక ప్రతిపాదనలు

కానీ.. రాకెట్ ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించిన మరుసటి రోజే జియోమాగ్నటిక్ తుపాను ప్రభావం కారణంగా ఈ ఉపగ్రహాలు కక్ష్యనుంచి పడిపోయి గాలిలోనే మండిపోయాయి. సూర్యుని ఉపరితలంలో శక్తిమంతమైన పేలుళ్ల కారణంగా సౌర తుపానులు ఏర్పడతాయని.. ఈ తుపానులు, భూమిని తాకగల సామర్థ్యమున్న ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాలను వెదజల్లుతాయని స్పేసెక్స్ వివరించింది. గత వారం ప్రయోగించిన 49 ఉపగ్రహాల్లో 40కి పైగా జియోమాగ్నటిక్ తుపాను బారినపడినట్లు స్పేసెక్స్ వివరించింది.

స్టార్ లింక్ కంపెనీ ద్వారా వేలాది ఉపగ్రహాలను ఉపయోగించి హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించాలని స్పేస్ ఎక్స్ అధినేత మస్క్ బావించారు. అందులో భాగంగా.. స్పేస్ ఎక్స్ ద్వారా 49 ఉపగ్రహాలను పంపించారు. వాటిని భూమికి 210 కిలోమీటర్ల ఎత్తులో మోహరించాలని భావించారు. ఫిబ్రవరి 3న ప్రయోగించిన ప్రతీ ఉపగ్రహం, నియంత్రిత స్థితిలోనే కక్ష్యలోకి చేరింది. కానీ.. ఈ ప్రయోగం జరిగిన మరుసటి రోజే జియోమాగ్నటిక్ తుపాను భూమిని తాకింది.

CM Jagan : సినీ పరిశ్రమ విశాఖకు కూడా రావాలి.. జూబ్లిహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దాం : సీఎం జగన్

నార్తర్న్ లైట్స్ లాగే.. ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపడంతో.. శాటిలైట్లు తమ కక్ష్యల నుంచి జారి తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయాయి. శాటిలైట్లను సేఫ్ మోడ్‌లో ఉంచేందుకు స్పేసెక్స్ తీవ్రంగా ప్రయత్నించినా… తుపాను తీవ్రత, వేగం కారణంగా అట్మాస్మిరిక్ డ్రాగ్‌లో 50 శాతం కంటే ఎక్కువ పెరగడంతో.. డ్యామేజ్ జరిగింది. ఇక.. కాలిపోయిన శాటిలైట్లలో ఏ ఒక్క భాగం కూడా భూమికి చేరే అవకాశం లేదని స్పేస్ ఎక్స్ స్పష్టం చేసింది.