Donald Trump : ట్రంప్‌పై అత్యాచారం కేసు .. కోర్టుకెక్కిన 79 ఏళ్ల మహిళ

నిన్నా మొన్నటి వరకు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు అక్రమ చెల్లింపుల కేసులో ఇరుక్కుని నానా పాట్లు పడ్డ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న ట్రంప్ పలు వివాదాల్లో చిక్కుకోవటం ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయా?

Donald Trump : ట్రంప్‌పై అత్యాచారం కేసు .. కోర్టుకెక్కిన 79 ఏళ్ల మహిళ

Women Pitition  Trump raped

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను అత్యాచారం చేశాడంటూ 79 ఏళ్ల మహిళ కోర్టును ఆశ్రయించారు. 30 ఏళ్ల క్రితం ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అప్పుడు నేను అనుభవించిన ఆ దారుణ పరిస్థితి వల్లే తాను ఈరోజున ఇక్కడ నిలబడ్డాను అంటూ ఆవేదన వ్యక్తంచేశారు E జీన్ కరోల్ అనే 79 ఏళ్ల రచయిత్రి. 30 ఏళ్ల క్రితం ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడిన ట్రంప్ తర్వాత అబద్దాలు చెప్పి తనను దారుణంగా మోసం చేశాడని కోర్టు విచారణలో వెల్లడించారామె. 1995-1996 మొదట్లో బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మ్యాన్ డిపార్ట్‌మెంట్ స్టోర్ డ్రెసింగ్‌రూములో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు కరోలిన్ తన పిటీషన్ లో పేర్కొన్నారు.

ట్రంప్ అప్పుడు తనపై అత్యాచారం చేయడం వల్లే తాను ఈరోజు ఇక్కడ నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని బుధవారం (ఏప్రిల్,2023)న మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో విచారణ సందర్భంగా వివరించారు కరోల్. ఈ ఘటన గురించి తాను అప్పట్లో తాను దీని గురించి అప్పట్లో కథనాలు రాసానని కోర్టుకు వివరించారు. కానీ ట్రంప్ అటువంటిదేమీ జరగలేదని పచ్చి అబద్ధాలు ఆడారని..ట్రంప్ వల్ల నా జీవితాన్ని నాశనం అయిందని ఆవేదన వ్యక్తంచేస్తూ విచారణలో న్యాయమూర్తులకు వివరించారు కరోల్. 79 ఏళ్ల కరోల్ ఎల్లె మ్యాగజైన్ మాజీ అడ్జైజ్ కాలిమిస్ట్. తనపై ట్రంప్ పాల్పడిన లైంగిక దాడికి ట్రంప్ పరిహారం కోరారు. కాకపోతే ఎంత పరిహారం అనేది తెలియలేదు.

Donal Trump Arrested : అమెరికా చరిత్రలో సంచలనం.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్

తనపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా అటువంటిదేమీ జరగలేదని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో చెబుతూ ట్రంప్ తన పరువును తీశారని ఆవేదన వ్యక్తం చేశారు కరోల్. ఇది దారుణమని..మోసమని ఆవేదన వ్యక్తంచేశారామె. కాగా ఎప్పుడే 30 ఏళ్ల క్రితం అత్యాచారం జరిగితే ఇన్నేళ్లకు కోర్టులో పిటీషన్ వేయటమేంటీ? అని అనుకోవచ్చు. కానీ అక్కడ అటువంటి వీలు ఉంది. కరోల్ న్యూయార్క్ అడల్ట్ సర్వైవర్స్ చట్టం కింద కూడా దావా వేశారు. ఈ చట్టం ద్వారా కొన్ని క్రితం జరిగిన నేరాలను కూడా సవాల్ చేయవచ్చు. అందుకే కరోల్ తనపై 30 ఏళ్ల క్రితం జరిగిన అత్యాచారానానికి ఇప్పుడు న్యాయం పొందాలని కోర్టును ఆశ్రయించారు.

కరోల్ ఆరోపణలపై ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’ ద్వారా తిప్పికొట్టారు. తనపై ఆరోపణలు రాజకీయం జరిగే కుట్ర అని తీసిపారేశారు. ఇందంతా ప్లాన్ ప్రకారం జరుగుతోందని ఆమె ఎవరో కూడా నాకు తెలియదని ఆరోపించారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ లూయిస్ కప్లాన్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ కేసు గురించి మాట్లాడడం ఆపకపోతే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.

కాగా..ట్రంప్ వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈసారి కూడా విజయం సాధించాలని ప్రచారాలను నిర్వహిస్తున్నారు. కోర్టులో తనపై అత్యాచారం ఆరోపణలకు సంబంధించి జరుగుతున్న విచారణకు ట్రంప్ హాజరుకాలేదు. పైగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ట్రూత్’లో ఈ కేసును తాను హాజరుకావాల్సిన అవసరమేలేదని..మహా అయితే ఈకేసు ఒకటి రెండు వారాలు జరుగుతుందేమో ఈమాత్రం దానికి తాను వెళ్లాల్సిన పనిలేదన్నారు. ట్రంప్ ట్రూత్ ద్వారా చేసే వ్యాఖ్యలపై యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ లూయిస్ కప్లాన్ తీవ్రంగా హెచ్చరించారు.

Donald Trump: నేను దోషిని కాదు..! ప్రపంచం మన దేశాన్ని చూసి నవ్వుతోంది.. డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్, విడుదల

కాగా పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు అక్రమ చెల్లింపుల కేసుల డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. అమెరికా రాజకీయ చరిత్రలో ఇదొ సంచలనంగా మారింది. ఈ కేసులో మాన్ హట్టన్ కోర్టులో ట్రంప్ లొంగిపోవటం అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించటం వంటి సంచలనాలు జరిగాయి. దీంతో అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటకట్టుకున్నారు.