Black Hole Near Earth : భూమికి స‌మీపంగా బ్లాక్‌హోల్‌.. సూర్యుడి కంటే 10 రెట్లు పెద్ద‌ది

భూమికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన ఒక‌ బ్లాక్‌హోల్ ను పాల‌పుంత‌లో గుర్తించారు. బ్రిట‌న్‌కి చెందిన‌ అంత‌రిక్ష ప‌రిశోధ‌కులు ఇంట‌ర్నేష‌న‌ల్ జెమిని అబ్జ‌ర్వేట‌రీ సాయంతో దీన్ని గుర్తించారు. పాల‌పుంత‌లో ఒక బ్లాక్‌హోల్‌ని గుర్తించ‌డం ఇదే తొలిసారి.

Black Hole Near Earth : భూమికి స‌మీపంగా బ్లాక్‌హోల్‌.. సూర్యుడి కంటే 10 రెట్లు పెద్ద‌ది

black hole

Black Hole Near Earth : భూమికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన ఒక‌ బ్లాక్‌హోల్ ను పాల‌పుంత‌లో గుర్తించారు. బ్రిట‌న్‌కి చెందిన‌ అంత‌రిక్ష ప‌రిశోధ‌కులు ఇంట‌ర్నేష‌న‌ల్ జెమిని అబ్జ‌ర్వేట‌రీ సాయంతో దీన్ని గుర్తించారు. పాల‌పుంత‌లో ఒక బ్లాక్‌హోల్‌ని గుర్తించ‌డం ఇదే తొలిసారి. దీనికి గయియ బీహెచ్ 1 అని పేరు పెట్టారు. ఇది భూమి నుంచి 1600 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో ఉంది.

అయితే, గ‌తంలో వాటికంటే ఈ బ్లాక్‌హోల్ మూడు రెట్లు వేగంగా భూమివైపు దూసుకొస్తోందని చెబుతున్నారు. ఈ బ్లాక్‌హోల్ సూర్యుడి కంటే 10 రెట్లు పెద్ద‌గా ఉంటుంద‌ని అంటున్నారు. అంతేకాదు, దీని ద్ర‌వ్య‌రాశి సుర్యుడి ద్ర‌వ్య‌రాశి కంటే దాదాపు 5 నుంచి 100 రెట్లు ఎక్కువ ఉంటుంద‌ని చెబుతున్నారు.

Black Holes : విశ్వంలో ఇదే తొలిసారి.. మూడు బ్లాక్ హోల్స్ విలీనం..

గ‌త నాలుగేళ్లుగా సుప్తావ‌స్త‌లో ఉన్న బ్లాక్‌హోల్‌ని క‌నిపెట్టేందుకు తాను ప్ర‌య‌త్నిస్తున్నట్లు ఆస్ట్రోఫిజిస్ట్ ఈఐ బాడ్రీ పేర్కొన్నారు. ఈసారి తన ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం అయిందన్నారు. ఈఐ బాడ్రీ త‌న టీంతో క‌లిసి ఈ బ్లాక్‌హోల్‌ని గుర్తించారు. హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ఆస్ట్రోన‌మీ గురించి ఆయన రీసెర్చ్ చేస్తున్నారు. ఈ బ్లాక్‌హోల్ గురించిన విష‌యాలను రాయ‌ల్ ఆస్ట్రోనామిక్ సొసైటీ నోటిస్‌లో ప్ర‌చురించారు.

ఏదైనా ఒక న‌క్ష‌త్రం దాని గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తిని కోల్పోవ‌డం వ‌ల్ల బ్లాక్‌హోల్స్‌ ఏర్ప‌డతాయి. ఒక పాల‌పుంత‌లో ఇలాంటివి 10 కోట్ల‌కు పైగా ఉంటాయని అంత‌రిక్ష ప‌రిశోధ‌కులు అంటున్నారు. వీటిని విల‌న్స్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఇవి వెలుతురుని త‌మ గుండా ప్ర‌స‌రించ‌నీయ‌వు. అందుక‌నే వీటికి కృష్ణ బిలం అనే పేరొచ్చింది.