ఆకుపచ్చగా మారిన అంటార్కిటికా

  • Published By: venkaiahnaidu ,Published On : May 23, 2020 / 07:36 AM IST
ఆకుపచ్చగా మారిన అంటార్కిటికా

నిత్యం మంచుతో మెరుస్తూ ఉండే మంచు ఖండం అంటార్కిటికా….ఆకుప‌చ్చ‌ని ప్ర‌దేశంగా మారుతున్న‌ది. రీసెంట్ అంటార్కిటికా ఫొటోలు చూస్తే ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. ఇది ఖచ్చితంగా అంటార్కిటికా కాదు ఏదో ఆఫ్రికా అడవులనే అంటారు. అంతలా మరింది అంటార్కిటికా ఇప్పుడు. వాతావ‌ర‌ణ మార్పులే అంటార్కిటికా మంచు ఆకుపచ్చగా మారడానికి కారణమని రీసెంట్ స్టడీ తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా వేడెక్కే ఉష్ణోగ్రతలు “ఆకుపచ్చ మంచు” ఏర్పడటానికి మరియు వ్యాప్తి చెందడానికి సహాయపడతున్నాయని మరియు ఇది అంతరిక్షం నుండి కూడా కనిపించే ప్రదేశాలలో చాలా సమృద్ధిగా మారుతోందని కొత్త రీసెర్చ్ తెలిపింది. 

వేడెక్కుతున్న వాతావ‌ర‌ణం వ‌ల్ల అంటార్కిటికాలో చిన్న చిన్న మొక్క‌లు చిగురిస్తున్న‌ట్లు తెలుస్తోంది. విస్తార‌మైన ఆ ఖండంలో మొలుస్తున్న ఆల్గే(నీటి పాచి)తో మంచు గ‌డ్డ‌ల‌న్నీ ఓ అంద‌మైన ప్రాంతాలుగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అంటార్కిటికాలో ఆల్గే ఉన్న‌ట్లు గ‌తంలో బ్రిటీష్ అన్వేష‌కుడు ఎర్నెస్ట్ షాక‌ల్ట‌న్ గుర్తించారు. 

AN2.jpg

యురోపియ‌న్ స్పేస్ ఏజెన్సీ సెంటిన‌ల్ 2 శాటిలైట్‌తో పాటు క్యాంబ్రిడ్జ్ వ‌ర్సిటీ, బ్రిటీష్ అంటార్కిటికా స‌ర్వే ప‌రిశోధ‌కులు.. అంటార్కిటికా ద్వీప తీరంలో ఉన్న శైవ‌లాల ఆన‌వాళ్ల‌కు సంబంధించిన మ్యాప్‌ను త‌యారు చేశారు. మంచు ఖండంలో ఆల్గే సుమారు 1679 చోట్ల విక‌సించిన‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. కార్బ‌న్ ఉద్గ‌రాలు ఎంత‌గా విడుద‌ల అవుతున్నాయో.. అంత త్వ‌ర‌గా అంటార్కిటికాలో శైవ‌లాల ఎదుగుద‌ల క‌నిపిస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. సుమారు 8.75 ల‌క్ష‌ల పెట్రోల్ కార్లు విడుద‌ల చేసే కార్బ‌న్ ఉద్గ‌రాల‌తో స‌మానంగా అంటార్కిటికా ఆల్గేలు ఉన్న‌ట్లు కేంబ్రిడ్జ్ వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ మాట్ డ‌వే తెలిపారు. ఒక్క ఆకుప‌చ్చ శైవ‌లాలే కాదు, ఎరుపు, నారింజ రంగు శైవ‌లాల గురించి కూడా స్ట‌డీ చేస్తున్న‌ట్లు రీసెర్చర్లు తెలిపారు. 

green-snow-.jpg

ప్రస్తుతం, అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలు దట్టమైన ఆల్గే సాంద్రతను కలిగి ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ పెరగడంతో ఆల్గే వికసిస్తుంది. భవిష్యత్తులో తెల్ల ఖండం మరింత పచ్చగా మారుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతకుముందు, క్లామిడోమోనాస్ నివాలిస్(ఏకకణ ఎరుపు రంగు కిరణజన్య సంయోగ ఆకుపచ్చ ) యొక్క ఆల్గల్ బ్లూమ్ కారణంగా, అంటార్కిటికా యొక్క మంచు ఎర్రగా రక్తం రంగులోకి మారింది. ఆల్గల్ బ్లూమ్ పర్యావరణంపై తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంది. ఆల్గల్ బ్లూమ్ మంచు నుండి వచ్చే కాంతి ప్రతిబింబాన్ని తగ్గిస్తుంది మరియు తరువాత మరింత శోషణకు దారితీస్తుంది. 

Read: పాక్ విమానం క్రాష్..సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్