Afghanistan G7 Meet : తాలిబ‌న్ల‌పై ఆంక్ష‌లు వ‌ర్కౌట్ కావు.. డ్రాగన్ సపోర్ట్..!

అప్ఘానిస్తాన్ తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో వారిపై ఆంక్షలు విధించడం వల్ల ఫలితం ఉండదని జీ-7 స‌భ్య దేశాల‌కు డ్రాగన్ చైనా స్పష్టం చేసింది.

Afghanistan G7 Meet : తాలిబ‌న్ల‌పై ఆంక్ష‌లు వ‌ర్కౌట్ కావు.. డ్రాగన్ సపోర్ట్..!

China Says Sanctions Against Taliban Not Productive

China says sanctions against Taliban not productive : అప్ఘానిస్తాన్ తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో వారిపై ఆంక్షలు విధించడం వల్ల ఫలితం ఉండదని జీ-7 స‌భ్య దేశాల‌కు డ్రాగన్ చైనా స్పష్టం చేసింది. అప్ఘాన్ సంక్షోభ సమయంలో తాలిబన్లపై ఆంక్షలతో సమస్య పరిష్కారం కాదని చైనా ముష్కరులకు బాసటగా నిలిచింది. గతంలో ఎదురైన అనుభవాల నుంచి గుణపాఠాలను నేర్చుకోవాలని హితువు పలికింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ చెప్పారు.

కరోనా సమయంలో అప్ఘాన్ సంక్షోభంపై జీ-7 సభ్య దేశాల అధినేతలు వర్చువల్ వేదికగా చర్చించనున్నారు. ఈ జీ-7 సమావేశంలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, అమెరికా సభ్య దేశాలు హాజరుకానున్నాయి. అప్ఘానిస్తాన్ లో తాలిబన్లు ఆక్రమించుకున్న అనంతరం దేశంలో సంక్షోభం తలెత్తింది. ఈ సంక్షోభాన్ని నివారించాలంటే అందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జీ-7 దేశాలు ప్రధానంగా చర్చ జరుపనున్నాయి. ఈ సమావేశానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధ్యక్షత వహించనున్నారు.
Aryana Sayeed:పాక్ అండతోనే తాలిబ‌న్ల‌ అరాచకాలు..అఫ్గాన్ దుస్థితికి పాకిస్థానే కారణం

అప్ఘాన్లకు వెన్నుదన్నుగా శరణార్థులకు అండగా నిలవాలని జీ-7 దేశాలను జాన్సస్ కోరే అవకాశం ఉంది. తాలిబన్లపై ఆంక్షలతో ఒత్తిడి తెచ్చేందుకు జీ-7 దేశాలు ప్రణాళికలపై చైనా స్పందిస్తూ.. శాంతిని కాపాడుతూ అప్ఘాన్ పునర్నిర్మాణానికి కృషి చేసేందుకు అవసరమైన చర్యలపై దృష్టిసారించాలని సూచించారు.