Russian Gold Ban : అగ్ర దేశాల నుంచి ఆంక్షలు..పెరుగుతున్న వడ్డీలు..100 ఏళ్ల తరువాత పీకల్లోతు సమస్యల్లో రష్యా

యుక్రెయిన్​పై యుద్ధానికి నిరసనగా రష్యా ఆర్థిక వనరుల్ని దెబ్బకొట్టాయి చాలా దేశాలు. పెద్దన్న అమెరికా సహా ఐరోపా దేశాలు కఠిన చర్యలు తీసుకున్నాయి.ఇప్పటికే రష్యా నుంచి ఎగుమతి అయ్యే క్రూడాయిల్ ను బ్యాన్ చేశాయి. ఇప్పుడు బంగారాన్ని కూడా బ్యాన్ చేశాయి.

Russian Gold Ban : అగ్ర దేశాల నుంచి ఆంక్షలు..పెరుగుతున్న వడ్డీలు..100 ఏళ్ల తరువాత పీకల్లోతు సమస్యల్లో రష్యా

G7 Nations To Announce Ban On Import Of Russian Gold (1) (1)

Russian Gold Ban : రెండు దేశాలు కొట్టుకుంటే.. కొంతమంది అటు.. మరికొందరు ఇటు చేరతారు. మా గడప నువ్వు తొక్కొద్దు.. మీ వస్తువుల్ని మేం ముట్టుకోవద్దంటూ ఆంక్షలు పెట్టుకుంటారు. రష్యా, యుక్రెయిన్‌ వార్‌లోనూ అంతే. రష్యాను టార్గెట్‌ చేసిన జీ-7 దేశాలు.. చమురు, బంగారం దిగుమతుల్ని చేశాయి. ఈ చర్యలతో అందరికీ ఇబ్బందే. ఎందుకంటే.. అన్ని వస్తువులూ అందరి దగ్గరా ఉండవు. అన్ని వనరులూ అన్ని దేశాల్లో దొరకవు. అంటే ఒకర్నించి ఒకరు ఇచ్చి పుచ్చుకోవాల్సిందే. అలా జరక్కపోతే.. ఎలాంటి కష్టాలు వస్తాయో.. రష్యాతో పాటు జీ-7 కంట్రీస్‌కు కూడా తెలిసొస్తోంది.

యుక్రెయిన్​పై యుద్ధానికి నిరసనగా రష్యా ఆర్థిక వనరుల్ని దెబ్బకొట్టాలన్నాయి చాలా దేశాలు. పెద్దన్న అమెరికా సహా ఐరోపా దేశాలు కఠిన చర్యలు తీసుకున్నాయి. రష్యా నుంచి చమురు కొనొద్దని చాలా రోజుల కిందటే పశ్చిమాసియా దేశాలు నిర్ణయించుకున్నాయి. రష్యా నుంచి నాటో, జీ-7 దేశాలకు అత్యధికంగా ఎగుమతయ్యేవి చమురు, సహజ వాయువులే. రష్యా నుంచి అందుతున్న గ్యాస్ పైన సుమారు 30 దేశాలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. వీటిలో ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్ లాంటి దేశాల్లో 80శాతం వాడకానికి రష్యా నుంచి అందుతున్న గ్యాసే ఆధారం. ఇపుడు హఠాత్తుగా గ్యాస్ సరఫరా ఆగిపోవటంతో చాలా దేశాలు అల్లాడిపోతున్నాయి. అలాగే చమురుకు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అలాగే గ్యాస్ చమురు కొనుగోలుపై నిషేధం విధించటంతో రష్యాకు కూడా కష్టాలు తప్పట్లేదు. భారీగా ఆదాయం పడిపోయింది. అయితే చైనా, భారత్ కొనుగోలు చేస్తుండటంతో అంతోఇంతో ఇబ్బందుల నుంచి బయటపడింది. ఈ క్రమంలో పుతిన్‌ నెత్తిన మరో పిడుగు వేశాయి వెస్ట్రన్‌ కంట్రీస్‌. బంగారం దిగుమతిని కూడా నిషేధించాయి. ఈ చర్యలతో ఇరుపక్షాలు ఏ రేంజ్‌లో నష్టపోతాయో చూడాలి.

Also read : Russia-ukraine war : రష్యాపై ఆంక్షల ఉచ్చు బిగించిన G-7 దేశాలు..బంగారం దిగుమతిపై నిషేధం..భారత్ పై ప్రభావం

మీరు క్రూడాయిల్‌ కొనకపోయినా.. బంగారంపై బ్యాన్‌ విధించినా.. మాకేం నష్టం లేదని గంభీరంగా చెప్పుకుంటోంది రష్యా. కానీ.. లోపల మాత్రం కుతకుతలాడిపోతోంది. ఎవరూ మమ్మల్ని దూరం పెట్టినా నష్టం లేదంటున్న.. జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. ఆర్థిక పరిస్థితి తల్లకిందులవుతోంది. వందేళ్లలో తొలిసారిగా డబ్బుల్లేక అప్పులు చెల్లించకపోవడంతో డిఫాల్టర్‌గా మారింది రష్యా. 1918 తర్వాత ఇదే తొలిసారి. యుక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా యూరోపియన్ దేశాలు కలిసి.. విదేశీ రుణదాతలకు చెల్లింపు మార్గాల్ని మూసేశారు. దీంతో రష్యా డిఫాల్టర్‌గా మారింది.

యుక్రెయిన్‌తో యుద్ధం నెలల తరబడి కొనసాగుతోంది. దాంతో రష్యా ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించింది. కానీ.. మే 27 నాటికే దాదాపు 100 మిలియన్ డాలర్ల స్నేర్డ్ ఇంటరెస్ట్ చెల్లింపులపై గ్రేస్ పీరియడ్ గడువు ముగిసింది. గడువు దాటితే డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. రష్యా ఆర్థికంగా, రాజకీయంగా దాదాపు ఒంటరిగా మిగిలిపోయిన పరిస్థితి. మార్చి ప్రారంభం నుంచి దేశీయ యూరోబాండ్స్ ట్రేడింగ్‌ పడిపోయింది. సెంట్రల్ బ్యాంకు విదేశీ నిల్వలు బ్లాక్‌ అయ్యాయి. రష్యాలోని అతిపెద్ద బ్యాంకుల్ని.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దూరం పెట్టింది. అసలే రెండంకెల ద్రవ్యోల్బణంతో పాటు దారుణ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పుతిన్‌ సర్కార్‌కు.. ఇప్పుడు అదనంగా డిఫాల్ట్‌ దెబ్బ పడింది.

Also read : Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!

అయితే కిందపడ్డా తనదే పైచేయి అంటోంది రష్యా. డిఫాల్ట్‌పై కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. తమ దగ్గర అవసరమైన ఫండ్స్ ఉన్నాయని.. అందరికీ అప్పులు చెల్లిస్తామని భరోసా ఇస్తోంది. వెస్ట్రన్‌ కంట్రీస్‌ కుట్రతోనే ఈ పరిస్థితి వచ్చిందంటూ నిప్పులు కురిపిస్తోంది. మే 27న చెల్లించాల్సిన 100 మిలియన్ డాలర్ల వడ్డీని యూరోక్లియర్ అనే బ్యాంకుకు పంపించామంటోంది. అయితే బ్యాంకు నుంచి రుణదాతలకు సొమ్ము చేరాల్సి ఉందని.. కానీ అక్కడ డబ్బులు చిక్కుకుపోయినట్టు చెప్తోంది.

రష్యా 40 బిలియన్ డాలర్ల మేర విదేశీ రుణాల్ని బాండ్ల రూపంలో తీసుకుంది. రష్యా దగ్గర దండిగా విదేశీ మారక నిల్వలు, బంగారం నిల్వలు ఉన్నాయి. కానీ ఏం లాభం..? అవన్నీ విదేశాల్లోనే ఉండడంతో.. అక్కడ స్తంభించాయి. చివరిగా రష్యా 1998లోనూ రూబుల్  (రష్యా కరెన్సీ) పతనంతో విదేశీ రుణ చెల్లింపుల్లో విఫలమైంది. అంతర్జాతీయ సాయంతో నాడు గట్టెక్కింది. మరి.. ఈసారి రష్యాను ఆదుకునేది ఎవరన్న ఉత్కంఠ నెలకొంది.