Russia-ukraine war : రష్యాపై ఆంక్షల ఉచ్చు బిగించిన G-7 దేశాలు..బంగారం దిగుమతిపై నిషేధం..భారత్ పై ప్రభావం

యుక్రెయిన్‌తో యుద్ధం రష్యాను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేస్తోంది. పుతిన్‌ను ఏకాకిని చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రష్యా నుంచి క్రూడాయిల్‌ దిగుమతుల్ని బ్యాన్‌ చేసిన పెద్ద దేశాలు.. ఇప్పుడు మరో గట్టి దెబ్బ కొట్టాయి. రష్యా నుంచి బంగారం ఇంపోర్ట్‌పై నిషేధం విధించాయి.

Russia-ukraine war : రష్యాపై ఆంక్షల ఉచ్చు బిగించిన G-7 దేశాలు..బంగారం దిగుమతిపై నిషేధం..భారత్ పై ప్రభావం

G7 Nations To Announce Ban On Import Of Russian Gold

G7 nations to announce ban on import of Russian gold : యుక్రెయిన్‌తో యుద్ధం రష్యాను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేస్తోంది. పుతిన్‌ను ఏకాకిని చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రష్యా నుంచి క్రూడాయిల్‌ దిగుమతుల్ని బ్యాన్‌ చేసిన పెద్ద దేశాలు.. ఇప్పుడు మరో గట్టి దెబ్బ కొట్టాయి. రష్యా నుంచి బంగారం ఇంపోర్ట్‌పై నిషేధం విధించాయి. చమురు తర్వాత రష్యా నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యేది బంగారమే. 2020లో ప్రపంచం మొత్తం బంగారం ఎగుమతుల్లో రష్యా వాటా 5శాతం. దీని విలువ 19 బిలియన్‌ డాలర్లు. దీనిలో 90శాతం బంగారం జీ-7 దేశాలకే వెళ్తోంది. ఇప్పుడు ఆయా దేశాలే బంగారం దిగుమతిని రద్దు చేసుకున్నాయి. లండన్‌ అతిపెద్ద గోల్డ్‌ ట్రేడింగ్‌ మార్కెట్లలో ఒకటి. ఇప్పుడు యూకే మిత్రదేశాల చర్యలతో రష్యాకు నిధుల సమీకరణ కష్టమే. ఇప్పటికే అమెరికా, యూకే, యూరోపియన్‌ యూనియన్‌ కలిపి దాదాపు వెయ్యిమంది మంది రష్యా సంపన్నులు, అధికారులు, సంస్థలపై ఆంక్షలు విధించాయి. తాజా నిర్ణయంతో రష్యాకు వచ్చే 13.5 బిలియన్‌ డాలర్ల ఆదాయానికి గండి కొట్టాయి. దీంతో పుతిన్‌ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది.

Also read :  Russia-Ukraine War : రష్యా సైనికులకు చుక్కలు చూపించిన ‘మేక’..! 40మందికి గాయాలు..!!

యుక్రెయిన్‌తో రష్యా వార్‌ నెలల తరబడిగా కొనసాగుతోంది. పుతిన్‌కు కూడా మోయలేని భారంలా మారింది. మధ్యలో వదిలేసి.. ప్రపంచం ముందు పరువు పోగొట్టుకోవద్దన్న పట్టుదలతో యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో పుతిన్‌ను కంట్రోల్‌ చేయాలంటే.. ఆర్థికంగా దెబ్బ కొట్టడమే కరెక్ట్‌ అన్నట్లు జీ-7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రష్యా నుంచి బంగారం దిగుమతులపై నిషేధం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. జర్మనీలోని మ్యునిచ్‌లో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశం వేదికగా.. రేపో, ఎల్లుండో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి.

జీ-7 అంటే ఏడు దేశాల బృందం. ఈ జీ-7 ఏడు దేశాల్లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందినట్లు భావించే ఈ ఏడు దేశాలు.. రష్యాపై ఆంక్షలు విధించడంతో ఆ దేశం పరిస్థితి ఇంకెంత దిగజారుతుందోనన్న ఆందోళన నెలకొంది. జీ-7 దేశాలు తీసుకున్న ఈ నిర్ణయం గతంలో దిగుమతుల కోసం చేసుకున్న ఒప్పందాలకు వర్తించదు. కొత్తగా ఎలాంటి దిగుమతులు చేసుకోరాదని నిర్ణయించారు. రష్యా నుంచి 15.45 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారాన్ని ఈ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి.

ఇద్దరు కొట్టుకుంటే.. మూడో వాడికి లాభమా, నష్టమా అని చూస్తుంటారు. ఇప్పుడు రష్యా బంగారంపై బ్యాన్‌ విషయంలోనూ సేమ్‌ సీన్‌. జీ-7 చర్యలతో మనకు లాభమా, నష్టమా అని మిగతా దేశాలు లెక్కలు వేసుకుంటున్నాయి. అందులో భారత్‌ కూడా ఉంది. గతంలో రష్యా క్రూడాయిల్‌ను జీ-7 బ్యాన్‌ చేయడంతో మనం లాభపడ్డాం. చైనా, భారత్‌లకు తక్కువ రేటుకే ముడి చమురు పంపించింది రష్యా. ఫిబ్రవరి- మే మధ్య రష్యా నుంచి 40 మిలియన్‌ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకున్నాం. గతేడాది మొత్తం దిగుమతులతో పోలిస్తే ఇది 20శాతం ఎక్కువే. ఇదే ఫార్ములా గోల్డ్‌ విషయంలోనూ వర్కవుట్‌ అవుతుందా అని ఇండియన్స్‌ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రష్యా నుంచి బంగారం దిగుమతులపై కూడా ప్రపంచ దేశాలు నిషేధం విధిస్తే.. అది భారత్​కు ప్రయోజనం చేకూరుస్తుందా? లేదా అని వ్యాపార నిపుణులు విశ్లేషించే పనిలో పడ్డారు.

Also read : Russia-ukraine war @5 months : 5 నెలలు దాటినా కొనసాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం

క్రూడాయిల్‌ నిల్వలు పేరుకుపోతే.. ఉత్పత్తి ఆపివేయాల్సి వస్తుంది. దానివల్ల కంపెనీలు నిండా మునుగుతాయి. పైగా నిల్వ చేయడమూ చాలా కష్టం. అందుకే లాభనష్టాలు ఆలోచించకుండా ఎప్పటికప్పుడు వదిలించుకోవాలి. రష్యా అదే చేస్తోంది. కానీ బంగారం అలా కాదు. అరిగేది.. కరిగేది కాదు. ఏళ్లపాటు దాచిపెట్టినా వీసమెత్తు నష్టం లేదు. పైగా రేటు పెరుగుతుందే తప్ప.. తగ్గదు. ఇవన్నీ ఆలోచించి.. రష్యా బంగారాన్ని దాచుకుంటుందా? లేక క్రూడాయిల్‌ కొనుగోలుతో సాయం చేసిన భారత్‌, చైనాలకు తక్కువ రేటుకే అమ్ముతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వరల్డ్‌ వైడ్‌గా బంగారాన్ని ఎక్కువగా వాడేది ఇండియా, చైనాలే. క్రూడ్ మాదిరిగానే బంగారాన్ని కూడా తక్కువ ధరకు రష్యా మనకు ఆఫర్ చేసే అవకాశముందని ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. అప్పుడు ఆటోమేటిక్‌గా మన దగ్గర గోల్డ్‌ రేట్లు తగ్గిపోతాయంటున్నారు.

Also read : Russia-Ukraine war : ‘బతికే ఒక్కరోజైనా హ్యాపీగా ఉందాం’ యుద్ధభూమి ఉక్రెయిన్ లో పెళ్లిళ్లు చేసుకుంటున్న వేలాది జంటలు!

అయితే.. అంత సీన్‌ లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. జీ-7 దేశాలు రష్యా నుంచి దిగుమతుల్ని ఆపేస్తే.. వేరే దేశాల నుంచి కచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా రేట్లు పెరుగుతాయి. ఇండియన్‌ మార్కెట్‌ అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి నడిచేది కాబట్టి.. మన దగ్గర బంగారం ధర తగ్గే ఛాన్స్‌ లేదంటున్నారు. పైగా అంతోఇంతో పెరగొచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ లెక్కన క్రూడాయిల్‌ తరహాలోనే బంగారం విషయంలోనూ రష్యా, భారత్‌ మధ్య అధికారికంగా ఒప్పందం జరగాల్సి ఉంది. అప్పుడే మనకు లాభమో నష్టమో తేలుతుంది.