Amazon Customer: అమెజాన్‌కు రూ.2కోట్ల 18లక్షలు టోకరా.. 20ఏళ్ల జైలు శిక్ష

ఐదేళ్లుగా అమెజాన్ నుంచి కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేస్తున్న అమెజాన్ కస్టమర్.. చీప్ ఐటెంలు పంపించారంటూ రిటర్న్స్ పెట్టి దొరికిపోయాడు. ఫలితంగా 20ఏళ్ల జైలు శిక్ష తప్పలేదు.

Amazon Customer: అమెజాన్‌కు రూ.2కోట్ల 18లక్షలు టోకరా.. 20ఏళ్ల జైలు శిక్ష

Amazon

Amazon Customer: ఐదేళ్లుగా అమెజాన్ నుంచి కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేస్తున్న అమెజాన్ కస్టమర్.. చీప్ ఐటెంలు పంపించారంటూ రిటర్న్స్ పెట్టి దొరికిపోయాడు. ఫలితంగా 20ఏళ్ల జైలు శిక్ష తప్పలేదు. నార్త్ కరోలినాలోని హ్యూడ్సన్ హ్యామ్రిక్ ను కోర్టు దోషిగా మంగళవారం తేల్చింది. 20ఏళ్లు జైలు శిక్షతో పాటు 2లక్షల 50వేల జరిమానాను విధించింది.

అమెజాన్ తరపు నుంచి 300 మోసపూరిత ట్రాన్సాక్షన్లు చేసినట్లు రుజువైంది. అంటే అందులో 270 ప్రొడక్ట్స్ రిటర్న్ చేయగా.. 250వస్తువులకు అంతకంటే ఎక్కువ విలువకు రిటర్న్ ఇచ్చారని తెలిసింది. మొత్తం 2లక్షల 90వేలు మోసం చేసినట్లుగా రుజువైందని ఛార్జింగ్ డాక్యుమెంట్లలో తేలింది.

హ్యామ్రిక్ వస్తువులు ఆర్డర్ చేయడం.. అవి వచ్చాక రిటర్న్ చేస్తూ చీప్ వస్తువులు పంపారని రీజన్ మెన్షన్ చేసేవాడు. వాటిని అమ్మేసుకుని తక్కువ ధర చెల్లించడం. లేదంటే పాత వస్తువులు, తక్కువ విలువున్న వస్తువులు పంపించేవాడని లాయర్లు వాదన వినిపించారు.

…………………………………………………………..: ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం..వారికి మాత్రమే

‘iMac Pro లాంటి హైఎండ్ వస్తువు రిటర్న్ చేసే సమయంలోనూ పాత.. నాన్ ప్రో మోడల్ రిటర్న్ చేశాడు. పూర్తిగా డిఫరెంట్ సీరియల్ నెంబర్ తో ఆ ప్రొడక్ట్ వచ్చిందని కోర్టు డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ఇంకా రిటర్న్ చేయడానికి వారం రోజుల ముందే దానిని అమ్మేశాడు కూడా.

రూ.2లక్షల 65వేల 694 విలువ చేసే కాఫీ మెషీన్, రూ.2లక్షల 8వేల గేమింగ్ ల్యాప్ టాప్, రూ.92వేల ఫ్యూజీ స్ప్రే సిస్టమ్ లను కూడా ఆర్డర్ పెట్టి వచ్చాక రిటర్న్ చేశాడు. ప్రతి మోడల్ ను తక్కువ విలువ చేసే వస్తువులంటూ చీప్ ఐటెంలు పంపించేవాడు.

అమెజాన్ లో పనిచేసే ప్రతినిధులు ఇటువంటి అనుమానపూరిత లావాదేవీలపై కన్నేసి ఉంచుతారు. వాటిపై ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకుంటారని అధికార ప్రతినిధి వెల్లడించారు. అమెజాన్ లో మోసానికి తావు లేదు. మోసాలకు పాల్పడితే కచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అని అన్నారు.