ఓటమిని ఒప్పుకోవయ్యా మగడా..పరువన్నా దక్కుతుంది..ట్రంప్ తో మొత్తుకుంటున్న మెలనియా

  • Published By: nagamani ,Published On : November 9, 2020 / 11:28 AM IST
ఓటమిని ఒప్పుకోవయ్యా మగడా..పరువన్నా దక్కుతుంది..ట్రంప్ తో మొత్తుకుంటున్న మెలనియా

America : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ట్రంప్ చిన్నపిల్లాడి బిహేవ్ చేస్తున్నారు. తన ఓటమిని అంగీకరించకుండా సుప్రీంకోర్టుకు వెళతాననీ..వైట్ హౌజ్ ఖాళీ చేయనని తెగ మారాం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ప్రముఖులైతే..ఏంటీ ఇంతకాలం ప్రెసిడెంట్ గా చేసిన ట్రంప్ ఇలా వ్యవహరించటం గౌరవంగా లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈక్రమంలో ట్రంప్ భార్య అమెరికా మాజీ తొలి మహిళ అయిన మెలానియా కూడా తన భర్తకు పలు సూచనలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమిని గౌరవంగా అంగీకరించమని సూచించారు.



ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించాలని ఓటమిని అంగీకరించి, గౌరవంగా పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటున్నారు మెలానియా. ఓటమిని అంగీకరించేందుకు ఏమాత్రం ఒప్పుకోని తన భర్త మనసును మార్చాలని ఆమె ప్రయత్నిస్తున్నట్టు ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే ట్రంప్ ప్రధాన అనుచరులతో మెలానియా మాట్లాడారని..ట్రంప్ కు నచ్చజెప్పి ఓటమిని అంగీకరించేలా చూడాలని కోరుతున్నారని మెలానియా సన్నిహిత వర్గాలు వెల్లడించినట్టు వార్తా సంస్థ పేర్కొంది.


కాగా ఎన్నికల్లో ట్రంపు ఓడిపోయి జో బైడెన్ గెలిచిన తరువాత తన భర్త ఓటమిపై మెలానియా ఇంతవరకూ స్పందించలేదు. ఈక్రమంలో ఆమె ట్రంప్ నుంచి విడాకులు కోరుకుంటున్నారని, ట్రంప్ వైట్ హౌస్ నుంచి బయటకు రాగానే ఆయన్నుండి విడిపోతారని వార్తలు వస్తున్నాయి. ట్రంప్ ఓటమిని అంగీకరిస్తున్న ఆమె, తన భర్త కూడా వాస్తవాన్ని హుందాగా అంగీకరించాలని కోరుతున్నారని ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది.



https://10tv.in/melania-to-divorce-donald-trump/
కాగా..అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు తన భర్త విజయం కోసం మెలానియా కూడా ఎంతగానో ప్రచారం చేశారు. కొడుకు అల్లుడు తదితరులతో కలిసి మెలానియా విస్తృత పర్యటనలు జరిపి ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాలు దాదాపుగా స్పష్టమైన తరువాత, తప్పుడు మార్గాల్లో బైడెన్ విజయం సాధించాలని చూస్తున్నారని, అందుకోసం పరుగులు పెడుతున్నారని ట్రంప్ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.


కాగా..కాగా..అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఓటమి తప్పలేదు. గెలుపు కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మెజార్టీ ఓట్లతో డెమాక్రాట్ అభ్యర్థి జో బైడెన్ 284 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్ పై విజయం సాధించారు. ట్రంప్ కేవలం 214 ఎలక్టోరల్ ఓట్లతో ఓటమిపాలయ్యారు. గెలిచిన బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.