Apple iPhone : టెక్‌ దిగ్గజం యాపిల్‌కి షాక్‌..​ దారుణంగా పడిపోయాయి

ప్రస్తుత ప్రపంచంలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. మార్కెట్ లో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో తీవ్రమైన పోటీ ఉంది. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు..

Apple iPhone : టెక్‌ దిగ్గజం యాపిల్‌కి షాక్‌..​ దారుణంగా పడిపోయాయి

Apple Iphone

Apple iPhone : ప్రస్తుత ప్రపంచంలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. మార్కెట్ లో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో తీవ్రమైన పోటీ ఉంది. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. కొత్త కొత్త ఆవిష్కరణలు, సరికొత్త ఫీచర్లతో ఫోన్లు తెస్తున్నాయి. అయినప్పటికి.. కొన్ని కంపెనీలకు ఇబ్బందులు తప్పడం లేదు. అమ్మకాలు పడిపోతున్నాయి. టెక్ దిగ్గజం ఐఫోన్‌ కు అలాంటి పరిస్థితే ఎదురైంది.

ఐఫోన్‌ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌కు సంబంధించి ట్రెండ్‌ ఫోర్స్‌ సంస్థ తాజా గణంకాలు విడుదల చేసింది. ఇందులో రెండో క్వార్టర్‌కి గ్లోబల్‌ మార్కెట్‌లో ఐఫోన్‌ అమ్మకాలు 13.7 శాతానికే పరిమితమైనట్టుగా తెలిపింది. గతేడాది ఫోన్‌ అమ్మకాలతో పోల్చితే 22 శాతం మేరకు ఐఫోన్‌ అమ్మకాలు తగ్గినట్టు ట్రెండ్‌సెట్‌ తెలిపింది.

Best Drinks : శరీరంలో కొవ్వును తగ్గించే పది పానీయాలు..

నెంబర్ 1 శామ్ సంగ్..
ఒక్కసారిగా ఫోన్ల అమ్మకాలు పడిపోవడంతో గ్లోబల్‌ మార్కెట్‌లో యాపిల్‌ సంస్థ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన అమ్మకాల్లో 19 శాతం మార్కెట్‌ వాటాతో శామ్‌సంగ్‌ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత 16.1 శాతం అమ్మకాలతో షావోమీ, ఒప్పోలో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వాటి తర్వాత 13.7 శాతం మార్కెట్‌తో యాపిల్‌ నాలుగో స్థానానికి పరిమితమైంది. 11.1 శాతం వాటాతో వివో ఐదో స్థానంలో ఉంది. వివో సంస్థ అమ్మకాల్లో సైతం 18 శాతం తగ్గుదల నమోదైంది.

భారమంతా ఐఫోన్‌ 13పైనే..
యాపిల్‌ సంస్థ ఈ నెలాఖరు కల్లా సరికొత్త మోడల్‌ ఐఫోన్‌ 13ను రిలీజ్‌ చేయబోంది. ఇప్పటికే ఐఫోన్‌ 13 ఫీచర్లకు సంబంధించి మార్కెట్‌లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సిమ్‌తో పని లేకుండా లో ఎర్త్‌ ఆర్బిట్‌ టెక్నాలజీపై ఐఫోన​ 13 పని చేస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఐఫోన్‌ 13కి మరింత క్రేజ్‌ తెచ్చేందుకు యాపిల్‌ వాచ్‌ 7 సిరీస్‌ను సైతం రిలీజ్‌ వచ్చంటూ కథనాలు వస్తున్నాయి. మొత్తంగా పడిపోయిన మార్కెట్‌ షేర్‌ను దక్కించుకునేందుకు ఐఫోన్‌ 13పైనే ఆ సంస్థ భారం వేసింది.

Rs 800 KG Bhindi : ఈ బెండ‌కాయ‌లు కిలో రూ.800.. ఎందుకంత కాస్ట్లీ అంటే

కరోనా ఎఫెక్ట్..
మలేషియాలో కరోనా కేసుల పెరుగుదల, చిప్ కొరత కూడా యాపిల్ ఐఫోన్ అవుట్‌పుట్‌ను దెబ్బతీసిందని ట్రెండ్ ఫోర్స్ అంచనా వేసింది. అంతేకాదు సెకండ్ క్వార్టర్ లో గ్లోబల్ స్మార్ట్ ఫోన్ ప్రొడక్షన్ 11శాతం పడిపోయింది. భారత్ లో కరోనా తీవ్రత.. షావోమీ, వివో, ఒప్పొ ఉత్పత్తి, అమ్మకాలపై ప్రభావం చూపిందని ట్రెండ్ ఫోర్స్ రిపోర్టు చెప్పింది.

ఎల్జీ తప్పుకున్నప్పటికి.. 2021లో 9.4 మిలియన్ల స్మార్ట్ ఫోన్ యూనిట్లు ఉత్పిత్తి చేసి 1శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది. భారత మార్కెట్ నుంచి ఎల్జీ నిష్క్రమణ.. లెనొవో, శాంసంగ్, నార్త్ అమెరికన్ బ్రాండ్స్ తమ మార్కెట్ ను విస్తరించుకునేందుకు సాయపడింది.