Galwan Attacks: గాల్వాన్ ఘర్షణలపై ప్రకంపనలు సృష్టిస్తున్న ఆస్ట్రేలియా పేపర్ కథనం

గాల్వాన్ ఘర్షణల్లో చైనా చెబుతున్నట్టుగా ఆదేశ సైనికులు నలుగురు మృతి చెందలేదని.. మొత్తం 42 మంది చైనా సైనికులు మృతి చెందారని The Klaxon పత్రిక పేర్కొంది

Galwan Attacks: గాల్వాన్ ఘర్షణలపై ప్రకంపనలు సృష్టిస్తున్న ఆస్ట్రేలియా పేపర్ కథనం

China

Galwan Attacks: తూర్పు లద్ధాక్ లోని గాల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య 2020లో చోటుచేసుకున్న ఘర్షణల గురించి ఆస్ట్రేలియా న్యూస్ పేపర్ .. The Klaxon’ ప్రచురించిన కధనం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆనాటి ఘర్షణల్లో చైనా చెబుతున్నట్టుగా ఆదేశ సైనికులు నలుగురు మృతి చెందలేదని.. మొత్తం 42 మంది చైనా సైనికులు మృతి చెందారని The Klaxon పత్రిక పేర్కొంది. గాల్వాన్ ఘర్షణలపై గత ఏడాది కాలంగా రహస్య విచారణ చేస్తున్న The Klaxon ప్రతినిధి.. ఈమేరకు చైనాలోని పలు సోషల్ మీడియా పరిశోధకుల ద్వారా విషయాన్ని రాబట్టారు. 2020 జూన్ 15న గాల్వాన్ లోయలో సరిహద్దు వద్ద భారత్ – చైనా సైనికులు ప్రత్యక్ష దాడులకు దిగారు. ఈ ఘర్షణల్లో భారత కల్నల్ సంతోష్ బాబు సహా.. 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు.

Also read: Flower Species: 99 మిలియన్ సంవత్సరాల పుష్పాల శిలాజాలు గుర్తింపు

అయితే తమ సైనికులు మాత్రం ఒక్కరు కూడా మృతి చెందలేదంటూ అప్పట్లో చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇక అంతర్జాతీయంగా పలు మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలతో విషయం వెలుగులోకి రావడంతో తమ సైనికుల్లో నలుగురు మృతి చెందారంటూ దాడి జరిగిన ఏడాది తరువాత చైనా ఒప్పుకుంది. ఆమేరకు మృతి చెందిన చైనా సైనికుల వివరాలను సైతం అంతర్జాతీయ మీడియాకు వెల్లడించింది చైనా. కాగా, 2021 ఫిబ్రవరిలో రష్యన్ వార్తా సంస్థ TASS ప్రచురించిన కథనం మేరకు.. భారత సైనికులతో ప్రత్యక్ష దాడులకు పాల్పడి 45 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు తెలిపింది. ఈ వాదనలను చైనా తోసిపుచ్చింది. తాము చెప్పిన లెక్కలే లెక్కలని పేర్కొంది. అనంతరం గాల్వాన్ ఘర్షణలపై ఎన్ని ఆరోపణలు వచ్చినా చైనా స్పందించలేదు.

Also read: ISRO Rockets: చంద్రయాన్ 3 సహా 19 ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో

ఈక్రమంలో అసలు నిజాన్ని బయటపెట్టేందుకు.. The Klaxon పత్రిక.. చైనాలోని ప్రముఖ బ్లాగర్లను, సోషల్ మీడియా యూజర్లను.. కలిసి సమాచారం రాబట్టారు. గాల్వాన్ మృతుల వివరాలను చైనా కప్పిపుచ్చుతుందని.. ఆన్ లైన్ సహా బయట ఎక్కడా కూడా దీనికి సంబందించిన సమాచారం లేకుండా చైనా అధికారులు జాగ్రత్త పడ్డారని The Klaxon పత్రిక వెల్లడించింది. 2020 జూన్ 15న జరిగిన ఘర్షణల్లో మొత్తం 42 మంది చైనా సైనికుల ఆచూకీ గల్లంతైనట్లు The Klaxon పేర్కొంది. గడ్డకట్టే చలిలో, చిమ్మ చీకటిలో భారత సైనికులతో మాట్లాడేందుకు వెళ్లిన.. 150 మంది చైనా సైనికులు.. ఉన్నట్టుండి ప్రత్యక్ష దాడులకు దిగారు. భారత సైనికులు ప్రతిఘటించడంతో చైనా సైనికులు వెనక్కు పరుగుతీసినట్లు The Klaxon తెలిపింది. ఆసమయంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న సెలయేరులో కొట్టుకుపోయి కొందరు గల్లంతవగా..చలికి తట్టుకోలేక కొందరు, గాయాలు తట్టుకోలేక(తరువాతి రోజుల్లో) కొందరు చైనా సైనికులు మృతి చెందారని The Klaxon తన కథనంలో వెల్లడించింది.

Also read: Karnataka Muslim Students: బురఖా ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థినులను అడ్డుకున్న ప్రిన్సిపాల్