Health Tips: ఆహారంలో మార్పులు చేసుకుంటే..జీవిత కాలంకంటే మరో 13 ఏళ్లు ఎక్కువే బతకొచ్చు: పరిశోధనల్లో వెల్లడి

ఆహారంలో మార్పులు చేసుకుంటే..మన జీవిత కాలంకంటే మరో 13 ఏళ్లు ఎక్కువగా బతకొచ్చు అని పరిశోధనల్లో వెల్లడైంది.

Health Tips: ఆహారంలో మార్పులు చేసుకుంటే..జీవిత కాలంకంటే మరో 13 ఏళ్లు ఎక్కువే బతకొచ్చు: పరిశోధనల్లో వెల్లడి

Balanced Diet (1)

Changing your diet..add up to 13 years to your life : కడుపు నిండా తినటం ముఖ్యం కాదు..మనం తినే ఆహారం సమతులంగా ఉందో లేదో గనమించుకోవాలి. సమతుల ఆహారం అంటే?..కడుపు నిండా తినటం కాదు. తినే ఆహారం మన శరీరానికి అవసరమయ్యే పోషక పదార్ధాలను తగు పాళ్ళలో అందించే ఆహారం. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు, నీరు మొదలైన పోషకాలను ప్రతీ రోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. అటువంటి ఆహారాన్నే మన శరీరాన్ని అందించాలి. దానికి తగిన వ్యాయామం ఉంటే ఆరోగ్యం మన సొంతమవుతుంది.

అలా ఆహారం తీసుకనే విషయంలో సమతుల్యత పాటిస్తే మన జీవితకాల్ని మరో 13 ఏళ్లు పెంచుకోవచ్చని నార్వే శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. అలా ఆహారంలో సమతుల్యత పాటిస్తే..మహిళలు తమ జీవితాన్ని 10 సంవత్సరాలు, పురుషులు 13 సంవత్సరాల వరకు పెంచుకోవచ్చని నార్వే శాస్త్రవేత్తలు తెలిపారు.

‌‌అంటే ప్రతీరోజు మనం తీసుకునే ఆహారంలో చిన్న మార్పులు (సమతుల ఆహారం తీసుకోకపోతే) చేసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. PLOS మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం..ఒక మహిళ 20 సంవత్సరాల వయస్సులో మంచి ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే, ఆమె తన జీవితాన్ని 10 సంవత్సరాలు పెంచుకోవచ్చని తెలిపింది. ఒక పురుషుడు తన జీవితానికి 13 సంవత్సరాలు అధికంగా జీవించవచ్చని వెల్లడైంది. ఆరోగ్యకరమైన ఆహారం వృద్ధుల జీవితకాలాన్ని కూడా పొడిగించగలదని అధ్యయనం చెబుతోంది.

60 సంవత్సరాల వయస్సు నుంచి ఒక స్త్రీ తన జీవితాన్ని 8 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. మగవారు తమ జీవిత కాలానికి దాదాపు తొమ్మిది సంవత్సరాలు జోడించవచ్చని పేర్కొంది. ఆహారంలో పచ్చి ఆకుకూరలు, కూరగాయలు క్రమం తప్పకుండా తీసుకుంటే 80 ఏళ్ల వయస్సు వారు కూడా ఈ ప్రయోజనం పొందవచ్చని ఈ అధ్యయం తేల్చింది. ఈ వయస్సులో ఆహారంలో మార్పులు పురుషులు, మహిళల జీవితకాలాన్ని 3.5 సంవత్సరాల వరకు పెంచుతాయని తెలిపింది.

ట్రూ హెల్త్ ఇనిషియేటివ్ ప్రెసిడెంట్.. వ్యవస్థాపకుడు డాక్టర్ డేవిడ్ కాట్జ్ మాట్లాడుతూ, “సమతుల్య ఆహారం దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అలాగే అకాల మరణ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని తెలిపారు. ఇలా సమతుల ఆహారం తీసుకుంటు తగిన వ్యాయమం కూడా చేస్తే..దీర్ఘాయువుని సొంతం చేసుకోవచ్చని తెలిపారు. దీర్ఘాయువు కోసం ఆహారాల మార్పుల్లో భాగంగా..గింజ ధాన్యాలను ఎక్కువగా చేసుకోవాలని సూచించారు. అంటే..చిక్కుళ్ళు, వీటిలో బీన్స్, బఠానీలు, కాయధాన్యాలు ఉండాలని అధ్యయనంలో తేలింది.

తృణధాన్యాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని..అలాగే వాల్ నట్స్, బాదం, పిస్తాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆకు, ధాన్యపు ఆహారాలు కూడా ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడతాయని ఈ అధ్యయనంలో తేలింది. అలాగే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరల్ని తీసుకోవాలని అధ్యయనకారులు తెలిపారు.

దీర్ఘాయువు, ఆహారంతో దాని సంబంధంపై డేటాను సేకరించడం కోసం చేసిన సర్వేలో ఇలాంటి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. నార్వే పరిశోధకులు స్త్రీలు, పురుషుల దీర్ఘాయువులో ఆహారం పాత్రపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. దీని కోసం ఒక నమూనాను తయారు చేశారు. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం పురుషులు లేదా స్త్రీల దీర్ఘాయువుతో ఎలా సంబంధం కలిగి ఉంటుందో ఇందులో పేర్కొన్నారు. రెండవ డేటాలో సమతుల్య ఆహారం ఉన్నవారి నుంచి సేకరించి రూపొందించారు. వీరి ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉన్నాయి.

US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన ఒక కొత్త నివేదిక ప్రకారం..కొంతమంది అమెరికన్లు తమ రోజువారీ సిఫార్సుల ప్రకారం పండ్లు, కూరగాయలు తింటారని వారి వివరాలను సేకరించగా..అటువంటివారు ఎక్కవ కాలం జీవిస్తున్నట్లుగా గుర్తించారు.