Al-Zawahiri’s death: దాడులు జరగొచ్చు అప్రమత్తంగా ఉండండి.. అమెరికా హెచ్చరిక

అల్ ఖైదా చీఫ్ అల్ జవహరినీ అగ్రరాజ్యం హతమార్చిన విషయం విధితమే. జవహరీ హత్యను తాలిబన్లు ఖండించారు. అమెరికన్ల పై ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని, ప్రపంచ వ్యాప్తంగా అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది.

Al-Zawahiri’s death: దాడులు జరగొచ్చు అప్రమత్తంగా ఉండండి.. అమెరికా హెచ్చరిక

Al-Zawahiri’s death: అల్ ఖైదా చీఫ్ అల్ జవహరినీ అగ్రరాజ్యం హతమార్చిన విషయం విధితమే. ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఓ ఇంట్లో తలదాచుకున్న అతడిపై డ్రోన్ల సహాయంతో క్షిపణి దాడులు చేసి మట్టుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. జవహరీ మృతితో 9/11 ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేసినట్లయిందని అన్నాడు. జవహరీ హత్యను తాలిబన్లు ఖండించారు. అమెరికా అంతర్జాతీయ నిబంధనలను అతిక్రమించిందని, 2000 సంవత్సరంలో కుదిరిన ఒప్పందాలను విస్మరించిందని ఆరోపించారు.

Al-Zawahiri: అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీ హతం.. మట్టుపెట్టిన అమెరికా

జవహరీని మట్టుబెట్టిన తరువాతర అమెరికన్ల పై ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది. ప్రపంచ ఉన్న వ్యాప్తంగా అమెరికన్లు, ఆయా దేశాల్లో అమెరికన్ కార్యాలయాలు, సానుభూతి పరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఆ దేశం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఉగ్రవాద సంస్థలు వివిధ దేశాల్లో అమెరికా సానుభూతి పరులు, కార్యాలయాలపై ఏ రూపంలోనైనా దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమకు అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.

Saif al-Adel: సైఫ్ అల్ అదేల్ ఎవరు? అల్‌ఖైదా నెక్ట్స్ చీఫ్ అతనేనా?

ఆత్మాహుతి దాడులు, హత్యలు, కిడ్నాప్ లు, బాంబు పేలుళ్లు ఇలా ఏ రూపంలోనైనా ఉగ్రవాదులు విధ్వంషాన్ని సృష్టించొచ్చని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని అమెరికన్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అమెరికా సూచించింది.