Twitter: ట్విట్టర్ బ్లూటిక్‌లు పోయాయి.. కడుపుబ్బా నవ్వించే మీమ్స్ వచ్చాయి..

Twitter: ఎలాన్ మస్క్ అన్నంత పనీ చేశారని కొందరు మీమ్స్ సృష్టించారు. బ్లూటిక్ పోగానే ఏం చేయాలో తెలియట్లేదంటూ కొందరు ట్వీట్లు చేశారు.

Twitter: ట్విట్టర్ బ్లూటిక్‌లు పోయాయి.. కడుపుబ్బా నవ్వించే మీమ్స్ వచ్చాయి..

Twitter

Twitter: బ్లూటిక్ కోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోని వారికి ఆ టిక్ ను తొలగిస్తూ ట్విట్టర్ (Twitter) చర్యలు తీసుకుంటుండడంతో దీనిపై అదే మైక్రోబ్లాగింగ్ సైట్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ బ్లూటిక్ (Twitter Blue Tick) ను చాలా మంది కోల్పోయిన విషయం తెలిసిందే. చాలా మంది రాజకీయ నాయకులు, సినీనటులు, క్రీడాకారులు ట్విట్టర్ చర్యతో షాక్ అయ్యారు.

మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉండే ప్రముఖులు.. ట్విట్టర్ ఇలా చేస్తుందని ఊహించలేదు. దీంతో ట్విట్టర్ పై సెటైర్లు, మీమ్స్ ఉప్పెనలా పొంగుతున్నాయి. “బ్లూటిక్ కావాలంటే.. బ్లాటిక్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి” అని ఎలాన్ మస్క్ చెబుతున్నట్లు కొందరు మీమ్స్ సృష్టించారు. ట్విట్టర్ తీసుకున్న చర్య అత్యద్భుతం అంటూ కొందరు సెటైర్లు వేశారు.

ఇంతకు ముందు బ్లూటిక్ ఉంటే చాలా గొప్పగా భావించే వారని, ఇప్పుడు అటువంటి వారు తమకు బ్లూటిక్ పోవడంతో.. బ్లూటిక్ ఉన్న ఇతరులను గొప్పవారుగా భావించాలని కొందరు కామెంట్లు చేశారు. మరోవైపు, ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) తన కంపెనీ చర్యను తనదైన శైలిలో సమర్థిస్తూ ట్వీట్ చేశారు.

“చాలా రకాలుగా చాలా గొప్ప రోజు” అంటూ ట్వీట్ చేశారు. చివరకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతానూ ఎలాన్ మస్క్ వదలలేదని కొందరు ట్వీట్లు చేశారు. బ్లూటిక్ ఉండాలంటే డబ్బులు ఉండాలని కొందరు సెటైర్లు వేశారు. ఎలాన్ మస్క్ అన్నంత పనీ చేశారని కొందరు మీమ్స్ సృష్టించారు. బ్లూటిక్ పోగానే ఏం చేయాలో తెలియట్లేదంటూ కొందరు ట్వీట్లు చేశారు.

 

Twitter: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, సమంత, కోహ్లీ.. ఇంకా ఎందరో..