Queen Elizabeth:క్వీన్​ ఎలిజబెత్​ బ్రిటన్ గద్దెనెక్కి 70ఏళ్లు..దేశం​లో ప్లాటినం జూబ్లీ వేడుకలు..తదుపరి రాణిగా కెమిల్లా

బ్రిటన్ క్వీన్​ ఎలిజబెత్​ బ్రిటన్ గద్దెనెక్కి 70ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా దేశం​లో ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి. బ్రిటన్ తదుపరి రాణిగా కెమిల్లాను ప్రకటించారు.

Queen Elizabeth:క్వీన్​ ఎలిజబెత్​ బ్రిటన్ గద్దెనెక్కి 70ఏళ్లు..దేశం​లో ప్లాటినం జూబ్లీ వేడుకలు..తదుపరి రాణిగా కెమిల్లా

Queen Elizabeth's Platinum Jubilee

Queen Elizabeth’s platinum jubilee: గ్రేట్ బ్రిటన్. ఒకప్పుడది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరించారు. బ్రిటీషర్లు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలను పాలించారు. ఫిబ్రవరి 6,2022 నాటికి ఇంకా కొన్ని దేశాలు బ్రీటీషర్ల పాలనలోనే ఉన్నాయి. ప్రస్తుతం బ్రిటన్ కు ఎలిజబెత్‌ రాణి-2 అధికారణిగా ఉన్నారు. 92 ఏళ్ల వయస్సులో కూడా క్వీన్ఎలిజబెత్ చక్కటి ఆరోగ్యంతో పాలిస్తున్నారు. ఆమె బ్రిటన్ గద్దెనెక్కి ఈనాటికి 70 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకున్ని బ్రిటన్ అంతా ప్లాటినం జూబ్లీ వేడుకలు చేసుకుంటోంది. బ్రిటన్ అంతా ప్లాటినం జూబ్లీ వేడుకల్లో మునిగితేలుతోంది.

Also read : Queen Elizabeth : సెంచరీ చేరువలో క్వీన్ ఎలిజిబెత్..ఆమె ఆరోగ్యం, ఆయుష్షు సీక్రెట్స్

క్వీన్​ ఎలిజబెత్​-2 బ్రిటిష్​ గద్దెనెక్కి నేటికి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా బ్రిటన్​లో ప్లాటినం జూబ్లీ వేడుకలు జరగనున్నాయి.అంత్యంత సుదీర్ఘకాలం పాటు బ్రిటన్​ను పారిపాలించిన ఏకైక రాజవంశానికి చెందిన మహిళ ఈమెనే కావడం విశేషం. 70ఏళ్ల సుదీర్ఘ పాలన తరువాత క్వీన్‌ ఎలిజబెత్‌ గద్దె దిగనున్నారు. అనంతరం తదుపరి రాణిగా ప్రిన్స్ చార్లెస్ భార్య కెమిల్లా కిరీటం ధరించి పాలన పగ్గాలు చేపట్టనున్నారు. 70 ఏళ్ల కెమిల్లా క్వీన్ కిరీటం ధరించి రాణికానున్నారు.

ఎలిజబెత్‌ రాణి-2 బ్రిటిష్‌ సింహాసనాన్ని అధిరోహించి ఫిబ్రవరి 6వ తేదీతో 70 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా బ్రిటన్‌ అంతటా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు జరగనున్నాయి. ఇంత సుదీర్ఘ కాలం బ్రిటన్‌ను పాలించిన తొలి రాజవంశీకురాలు ఆవిడే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జరిగే సంబరాలు జూన్‌ 2-5 మధ్య నాలుగురోజుల సెలవుదినాలతో ముగియనున్నాయి.

Also read :  Princess Diana car : ప్రిన్సెస్ డ‌యానా కారు వేలం..కళ్లు చెదిరే ధ‌ర పలికిన ఫోర్డ్ ఎస్కార్ట్

95 ఏళ్ల ఎలిజబెత్‌ రాణి-2 దేశానికి అందించిన సేవలను గౌరవిస్తూ ఈ నాలుగు రోజుల్లో విందు వినోదాలు, ప్లాటినం పుడ్డింగ్‌ తయారీ పోటీలు కూడా జరుగుతాయి. ఈ పోటీల్లో అయిదుగురిని తుది పోటీలకు ఎంపిక చేస్తారు. విజేతను బకింగ్‌హాం ప్యాలెస్‌ ప్రధాన చెఫ్‌ మార్క్‌ ప్లానగన్‌తో పాటు టీవీ వంటల కార్యక్రమ జడ్డీలు మోనికా గాలెట్టి, మేరీ బెర్రీ నిర్ణయిస్తారు. పోటీలో నెగ్గిన వంటకాన్ని ప్రజలకు ప్రదర్శిస్తారు. జూన్‌లో రెండో శనివారం రాణి జన్మదిన వేడుకలో భాగంగా సైనిక కవాతు జరుగుతుంది. బ్రిటిష్‌ వాయుసేన విమానాల ప్రదర్శనతో ఈ కవాతు ముగుస్తుంది.తదుపరి రాణి కెమిల్లా ప్రిన్స్ చార్లెస్ భార్య కెమిల్లా కిరీటం ధరించి రాణికానున్నారు.

ప్రిన్స్ చార్లెస్ రాజు అయినప్పుడు డచెస్ ఆఫ్ కార్న్‌వాల్ కెమిల్లానే రాణి అవుతుందని క్వీన్ ఎలిజబెత్-2 అన్నారు. శనివారం (ఫిబ్రవరి 6,2022) జరిగిన రాణి ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా జాతినుద్దేశించి ఇచ్చిన సందేశంలో తన తరువాత కెమిల్లానే రాణి అవుతుందని ప్రకటించారు. ఇప్పటి వరకు తనకు అందించిన సహకారమే తన కుమారుడు, కోడలుకు కూడా అందించాలని కోరారు. ఇన్ని రోజులు తమ కుటుంబంపై విధేయతను కలిగి ఉన్నందుకు అధికారులతో పాటు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ క్వీన్ ఎలిజబెత్. నిరంతరాయంగా ప్రజలు చూపిన విదేయత, ఆప్యాయతలకు ఎప్పటికీ వినయంతో, కృతజ్ఞతతో ఉంటానన్నారు.

Also read : Cake Slice Auction : వేలానికి 40 ఏళ్ల నాటి కేకు ముక్క ..ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

కాలానుగుణంగా చార్లెస్ రాజు అయినప్పుడు, దీర్గకాలంగా విశ్వసనీయ సేవలు అందిస్తోన్న భార్య కెమిల్లా రాణి కావాలన్నది తన కోరిక అని క్వీన్ ఎలిజబెత్ మరోసారి సుస్పష్టంచేశారు. ఇంతవరకు ప్రజలు తనకు అందించిన సహకారాన్నే కొడుకు, కోడలికీ అందిస్తారని ఆశిస్తున్నట్లు ఎలిజబెత్ పేర్కొన్నారు.

రాచరిక వ్యవస్థలో రాజు భార్యకు సహజంగానే రాణి హోదా వస్తుంది. అయితే కెమిల్లా విషయంలో మాత్రం కొంత అనిశ్చితి నెలకొంది. ప్రిన్స్ చార్లెస్ కు ఆమె రెండో భార్య కావడం, కెమిల్లాకు కూడా ఇది రెండో పెళ్లి కావడమే ఇందుకు కారణం. చార్లెస్ తొలుత ప్రిన్స్ డయానాను పెళ్లిచేసుకున్నారు. 1996లో వారు విడాకులు తీసుకున్న ఏడాదికే డయానా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయారు. ఆ తర్వాత 2005లో చార్లెస్, కెమిల్లాల పెళ్లయింది.

బ్యూటీక్వీన్ గానే కాకుండా గొప్ప హృదయం కలిగిన రాకుమారిగా పేరుపొందిన డయానా స్థానంలోకి కెమిల్లా రావడంతో ఆమెపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు గత సర్వేల్లో వెల్లడైంది.ఈ క్రమంలోనే కెమిల్లాకు రాణి హోదా దక్కుతుందా, లేదా అనే అనుమానాలుండేవి. వీటన్నిటినీ పక్కనపెడుతూ కెమిల్లాకే కిరీటం దక్కాలని ఎలిజబెత్ కోరుతున్నారు.ఆమె కోరిక మేరకు కెమిల్లా రాణి కిరిటం ధరించి పాలన పగ్గాలు చేపట్టనున్నారు.