Princess Diana car : ప్రిన్సెస్ డ‌యానా కారు వేలం..కళ్లు చెదిరే ధ‌ర పలికిన ఫోర్డ్ ఎస్కార్ట్

ప్రిన్సెస్ డయానా కారు వేలం వేయగా భారీ ధరకు అమ్ముడైపోయింది. ప్రిన్సెస్ డాయానాకు చెందిన ‘ఫోర్డ్ ఎస్కార్ట్ కారు’ 50 వేల పౌండ్స్‌కు పైగా ధ‌ర ప‌లికింది. అంటే మ‌న క‌రెన్సీలో అయితే దాదాపు రూ.50 ల‌క్ష‌ల‌కు పైమాటే. ఓ పాత కారు అంత ధరకు అమ్ముడైందీ అంటే అది ప్రిన్సెస్ డయానాకు ఉన్న క్రేజ్.

Princess Diana car :  ప్రిన్సెస్ డ‌యానా కారు వేలం..కళ్లు చెదిరే ధ‌ర పలికిన ఫోర్డ్ ఎస్కార్ట్

Princess Diana Car

Princess Diana car auction : ద గ్రేట్ బ్రిటన్. వేల్స్ యువరాణి డయానా. ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగిన పేరు. డయానా అంటే అందం..ప్రిన్సెస్ అఫ్ వేల్స్. డయానా అంటే ఓ సంచలనం. ఓ అద్భుతం. ఇలా ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు తాజాగా ప్రిన్సెస్ డయానా కారు వేలం వేయగా ఆమెకున్న డిమాండ్ మరోసారి మారుమ్రోగింది. ఆమె కారు వేలంలో భారీ ధరకు అమ్ముడైపోయింది. ప్రిన్సెస్ డాయానాకు చెందిన ‘ఫోర్డ్ ఎస్కార్ట్ కారు’ గత మంగ‌ళ‌వారం (జూన్ 29,2021)వేలం వేశారు. వేలంలో ఆ కారు 50 వేల పౌండ్స్‌కు పైగా ధ‌ర ప‌లికింది. అంటే సుమారు 69,200 అమెరిక‌న్ డాల‌ర్‌లు, 58,100 యూరోలు. మ‌న క‌రెన్సీలో అయితే దాదాపు రూ.50 ల‌క్ష‌ల‌కు పైమాటే. ద‌క్షిణ అమెరికాకు చెందిన ఓ మ్యుజీషియ‌న్ ఆ కారును కొనుగోలు చేశారు. డ‌యానాకు ఆ కారును ప్రిన్స్ చార్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఆ కారు ఇప్పటికీ అలాగే ఉంది. ఏమాత్రం చెక్కు చెదరలేదట. 1981, మేలో జరిగిన వారి వివాహానికి ముందు డ‌యానాకు ఎంగేజ్‌మెంట్ గిఫ్ట్‌గా ప్రిన్స్ చార్లెస్ ఆ కారును గిఫ్టుగా ఇచ్చారు. అలా ఆ కారు అపురూపమైంది.

1961 లో జన్మించిన డయానా 1981లో ఇంగ్లండ్‌ రాణి ఎలిజబెత్ చిన్న కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను వివాహం చేసుకున్నారు. వివాహానికి రెండు నెల‌ల ముందు 1981 మే నెల‌లో ప్రిన్సెస్ డయానాకు ఫోర్డ్ ఎస్కార్ట్ ఘియా స‌లోన్ కారును ఎంగేజ్‌మెంట్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ కారును జూన్ 29న ఎసెక్స్‌లో వేలంవేశారు. ఈ ఐదు డోర్ల హ్యాచ్‌బ్యాక్ కారును డయానా 1982 ఆగస్టు వరకు ఉపయోగించింది. ఆ కారును ఆమె చాలా అపురూపంగా చూసుకునేవారని ఆమె సన్నిహితులు చెప్పేవారు.

ఆ కారును గ‌త 20 ఏళ్లుగా ఉప‌యోగించ‌కుండా ఉన్నప్ప‌టికీ అది ఇప్పటికీ రాయల్ గ్యారేజ్‌లో మంచి కండిషన్ లోనే ఉందట. స్థితిలోనే ఉంద‌ట‌. ఒక పాతకారుకు ఇంత ధరా అంటూ నోరెళ్లబెడుతున్నారు. అదే మరి డయానా అంటే. ఆమె పేరే ఓ బ్రాండ్. ఇక మరి ఆమె ఉపయోగించిన వస్తువులకు డిమాండ్ ఎలా తగ్గుతుందనేలా ఆమెకారు భారీ ధరకు అమ్ముడైపోయింది.

ఆ కారు అసలు రిజిస్ట్రేషన్ నెంబర్ WEV 297W ప్లేట్ ఇప్పటికి అలాగే ఉందట‌. కారులోని మీటర్ ప్రకారం.. ఈ కారు 83,000 మైళ్ళు ప్రయాణించింది. అంటే ఇది దాదాపుగా 1,33,575 కిలోమీటర్లు ప్రయాణించింది. కారులో అమర్చిన 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6,000 ఆర్‌పీఎమ్ వద్ద 78 బీహెచ్‌పీ పవర్, 3,000 ఆర్‌పీఎమ్ వద్ద 125 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుందట‌. ఇంజిన్ 4 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుందట‌.

కాగా కేవలం 36 ఏళ్ల వయసులోనే ఆగస్టు 31, 1997లో పారిస్‌కు వెళ్లిన డయానా ఘోరరోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మోటార్‌బైక్‌ను తప్పించబోయి కారు పల్టీ కొట్టడంతో డయానా అక్కడికక్కడే మరణించారు. ఆమె జీవితంలాగే ఆమె మరణం కూడా చాలా చాలా సెన్సేషన్ అయ్యింది అప్పట్లో. కానీ మీడియా వెంబడించటవల్లే వారి నుంచి తప్పించుకునే క్రమంలో కారు ప్రమాదానికి గురైంది అనే మాట ఇప్పటికీ వార్తల్లో ఉంది.