చైనాలో మళ్లీ లాక్ డౌన్, కరోనా సెకండ్ వేవ్ ఆపేందుకు

రాజధాని బీజింగ్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో చైనా అలర్ట్ అయ్యింది. చైనాలో కరోనా సెకండ్ వేవ్

  • Published By: naveen ,Published On : June 20, 2020 / 09:05 AM IST
చైనాలో మళ్లీ లాక్ డౌన్, కరోనా సెకండ్ వేవ్ ఆపేందుకు

రాజధాని బీజింగ్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో చైనా అలర్ట్ అయ్యింది. చైనాలో కరోనా సెకండ్ వేవ్

రాజధాని బీజింగ్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో చైనా అలర్ట్ అయ్యింది. చైనాలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందనే వార్తలు వస్తున్నాయి. రెండు నెలల తర్వాత వందల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బీజింగ్ లో ఎక్కువ సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. దీంతో ప్రజలు, అధికారులు ఉలిక్కిపడ్డారు. అలర్ట్ అయిన అధికారులు కరోనా సెకండ్ వేవ్ ను ఆపేందుకు బీజింగ్ లో మళ్లీ లాక్ డౌన్ విధించారు. ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు. కరోనా లేని వారిని మాత్రమే నగరం వీడి వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తున్నారు. 

కొత్త కేసులకు జిన్ఫాడీ మార్కెట్ తో లింకులు :
బుధవారం ఒక్క రోజే బీజింగ్ లో 31 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇవన్నీ కూడా జిన్ఫాడీ(xinfadi) హోల్ సేల్ మార్కెట్ తో సంబంధం ఉన్నవే. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 137కి పెరిగింది. కాగా 57 రోజుల వరకు బీజింగ్ లో ఒక్క కేసు కూడా లేదు. సడెన్ గా పరిస్థితి మారింది. పెద్ద సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు బయటపడ్డాయి. కేసులు పెరుగుతున్న క్రమంలో మరోసారి స్కూళ్లు మూసేయాలని నిర్ణయించారు. బీజింగ్ కు వచ్చి వెళ్లే 1200 విమానాలను క్యాన్సిల్ చేశారు. బస్సు, రైళ్లు ప్రయాణాలను ఆపేశారు. కొన్ని రోజుల క్రితమే రీఓపెన్ చేసిన రెస్టారెంట్లు, బార్లను మళ్లీ మూసివేయించారు.

కంట్రోల్ లోకి వచ్చిందని అనుకునే లోపే మళ్లీ కరోనా విజృంభణ:
చైనాలో కరోనా పూర్తి కంట్రోల్‌కి వచ్చిందని అంతా అనుకున్నారు. ఇంతలోనే కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. నిన్న వుహాన్ ను వణికించిన మహమ్మారి ఇప్పుడు చైనా రాజధాని బీజింగ్‌ను వణికిస్తోంది. బుధవారం ఒక్కరోజే 31 కేసులు నమోదు కావడంతో అధికారులు బీజింగ్‌ను క్లోజ్‌ చేశారు. చాలా చోట్ల లాక్‌డౌన్‌ విధించారు. బీజింగ్‌ ఎయిర్‌‌పోర్ట్‌లను మూసేశారు. 1255 ఫ్లైట్లను క్యాన్సిల్‌ చేశారు. బీజింగ్‌కు రావాల్సిన 70 శాతం ఫ్లైట్‌ ట్రిప్పులు క్యాన్సిల్‌ అయ్యాయి. హై రిస్క్‌ ఏరియాల నుంచి వచ్చే వారిపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించారు. బీజింగ్‌ నుంచి వేరే ప్రదేశాలకు వెళ్లాల్సిన వాళ్లు న్యూక్లీ యాసిడ్‌ టెస్టులు చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. బీజింగ్‌ నుంచి చైనాలోని ఇతర ప్రావిన్స్‌లకు వెళ్లిన వారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. దాదాపు కంట్రోల్‌లోకి వచ్చేసిందనుకున్న వైరస్‌ మళ్లీ మొదలైందని, పరిస్థితి ఆందోళన కరంగా ఉందని బీజింగ్‌ అధికారులు చెప్పారు. జిన్ఫాడీ మార్కెట్‌ లింకులను ట్రేస్‌ చేస్తూ టెస్ట్‌ చేస్తున్నారు.

బీజింగ్ లో భయం భయం:
బీజింగ్‌లో నమోదవుతున్న కేసులన్నీ జిన్ఫాడీ మార్కెట్‌తో లింక్‌ అయి ఉండటంతో బీజింగ్‌లోని 11 మార్కెట్లను అధికారులు క్లోజ్‌ చేశారు. మార్కెట్‌తో లింక్‌ ఉన్న ప్రతి ఒక్కరికి మాస్‌ టెస్టులు చేస్తున్నారు. వారంలో రోజుల్లో 137 మంది వ్యాధి బారిన పడ్డారని, వారిలో చాలామందికి లక్షణాలు లేకుండానే వ్యాధి సోకిందని తెలుసుకున్నారు. స్పోర్ట్స్‌ ఈవెంట్స్ రద్దు చేశారు. గుంపులుగా తిరగడంపై నిషేధం విధించారు. మాస్కులు కంపల్సరీగా వాడాలని ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కాగా, బీజింగ్ లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు ప్రాణ భయంతో బతుకుతున్నారు.

Read: వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆరోగ్యం కోసం 5 ఆసనాలు, పని చేసే చోటే చేసుకోవచ్చు