China-Taiwan conflict: తైవాన్‌కు రూ.8,768 కోట్ల ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా నిర్ణయం.. చర్యలు తప్పవని చైనా వార్నింగ్

చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ తైవాన్ కు అమెరికా మరోసారి భారీ సాయాన్ని ప్రకటించింది. దాదాపు రూ.8,768 కోట్ల ఆయుధాలను విక్రయించేందుకు నిర్ణయించింది. వాటిలో నౌకల విధ్వంసక ఆయుధాలు, గగనతలం నుంచి గగనతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్షిపణులు కూడా ఉన్నాయి. ద‌క్షిణ చైనా స‌ముద్రంలో ఆధిప‌త్యం చలాయించాల‌ని, తైవాన్‌ను త‌న అధీనంలోకి తెచ్చుకోవాలని చైనా ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

China-Taiwan conflict: తైవాన్‌కు రూ.8,768 కోట్ల ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా నిర్ణయం.. చర్యలు తప్పవని చైనా వార్నింగ్

China-Taiwan conflict

China-Taiwan conflict: చైనా-తైవాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ తైవాన్ కు అమెరికా మరోసారి భారీ సాయాన్ని ప్రకటించింది. దాదాపు రూ.8,768 కోట్ల ఆయుధాలను విక్రయించేందుకు నిర్ణయించింది. వాటిలో నౌకల విధ్వంసక ఆయుధాలు, గగనతలం నుంచి గగనతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్షిపణులు కూడా ఉన్నాయి. ద‌క్షిణ చైనా స‌ముద్రంలో ఆధిప‌త్యం చలాయించాల‌ని, తైవాన్‌ను త‌న అధీనంలోకి తెచ్చుకోవాలని చైనా ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

ఇప్పటికే తైవాన్‌కు 862 కోట్ల రూపాయ‌ల విలువైన‌ మిలట‌రీ-సాంకేతిక సాయాన్ని అందించ‌డానికి అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటికే తైవాన్‌తో అమెరికా నాలుగుసార్లు ఆయుధాలు విక్ర‌యించే ఒప్పందాలు చేసుకుంది. తాజాగా, అమెరికా ప్రకటించిన రూ.8,768 కోట్ల ఆయుధాలను విక్రయ ఒప్పందంపై చైనా స్పందించింది. ఇందుకు ప్రతిగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అమెరికా చర్యను తమ దేశం వ్యతిరేకిస్తోందని అమెరికాలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియు పెంగ్యు చెప్పారు.

తైవాన్ కు ఆయుధాలు అమ్ముతూ చైనా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని, ఇది తమ సార్వభౌమత్వానికి, భద్రతాపర ప్రయోజనాలకు భంగం కలిగించడమేనని అన్నారు. ద‌క్షిణ చైనా స‌ముద్రంలో ఆధిప‌త్యం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోన్న చైనాకు అమెరికా చ‌ర్యలు ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి. మరోవైపు, తైవాన్‌ను స్వాధీనం చేసుకోవ‌డానికి చైనా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా చర్యలను అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది.

Rains in telangana: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం