కరోనా కల్లోలం, 12వేల మృతదేహాల కోసం భారీ తాత్కాలిక మార్చురీ నిర్మాణం

లండన్ లోని ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయం బర్మింగ్ హామ్ ఎయిర్ పోర్టులో భారీ మార్చురీ నిర్మాణం జరుగుతోంది. ఏకంగా ఒకేసారి 12వేల మృతదేహాలను భద్రపరిచేలా ఈ

  • Published By: veegamteam ,Published On : March 28, 2020 / 10:24 AM IST
కరోనా కల్లోలం, 12వేల మృతదేహాల కోసం భారీ తాత్కాలిక మార్చురీ నిర్మాణం

లండన్ లోని ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయం బర్మింగ్ హామ్ ఎయిర్ పోర్టులో భారీ మార్చురీ నిర్మాణం జరుగుతోంది. ఏకంగా ఒకేసారి 12వేల మృతదేహాలను భద్రపరిచేలా ఈ

లండన్ లోని ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయం బర్మింగ్ హామ్ ఎయిర్ పోర్టులో భారీ మార్చురీ నిర్మాణం జరుగుతోంది. ఏకంగా ఒకేసారి 12వేల మృతదేహాలను భద్రపరిచేలా ఈ తాత్కాలిక మార్చురీ నిర్మాణం జరుగుతోంది. యూకేలో(యునైటెడ్ కింగ్ డమ్) కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత అధికంగా ఉంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్యా పెరుగుతోంది. ఏకంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారిన పడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో కరోనా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నారు. అదే కనుక జరిగితే మృతదేహాలను భద్రపరిచేందుకు ఉన్న మార్చురీలు సరిపోవు. దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.

భారీ మార్చురీ నిర్మాణం విషయాన్ని ఎన్ హెచ్ ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సర్ సైమన్ స్టీవ్స్ ఈ విషయాన్ని నిర్ధారించారు. బర్మింగ్ హామ్ నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్, మాంచెస్టర్ సెంట్రల్ కన్వెన్షన్ సెంటర్ లను తాత్కాలిక ఆసుపత్రులకు మారుస్తున్నామని చెప్పారు. కరోనా పేషెంట్లకు అక్కడ చికిత్స అందిస్తామన్నారు. అలాగే లండన్ ఎక్సెల్ సెంటర్ ని తాత్కాలిక ఆసుపత్రిగా మార్చినట్టు తెలిపారు. ప్రస్తుతం బర్మింగ్ హామ్ ఎయిర్ పోర్టులో మార్చురీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి 1500 మృతదేహాలు భద్రపరిచేందుకు అవకాశం ఉంది. మార్చురీని మరింత విస్తరిస్తున్నారు. ఏకంగా 12వేల మృతదేహాలను భద్రపరిచేలా మార్చురీ నిర్మాణం జరుగుతోంది. 

కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారితో పాటు ఇతర కారణాలతో చనిపోయిన వారి మృతదేహాలను కూడా భద్రపరిచేందుకు ఈ మార్చురీని వినియోగిస్తామని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లోని బెడ్ల సంఖ్య పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. వారికి ఆర్మీ సాయం చేస్తోంది. బ్రిటన్ ప్రధాని, ఆ దేశ ఆరోగ్య శాఖ కార్యదర్శి సైతం కరోనా వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఆర్మీ సాయంతో స్వల్ప వ్యవధిలోనే ప్రభుత్వం నైటింగేల్ ఆసుపత్రి నిర్మించింది. ఈ ఆసుపత్రుల్లో 500 బెడ్లు ఉన్నాయి. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు దీన్ని నిర్మించారు. ఇదే ఆసుపత్రిని మరింత విస్తరించాలని చూస్తున్నారు. 4వేల బెడ్ల ఆసుపత్రిగా మార్చాలని ప్లాన్స్ చేస్తున్నారు.

బర్మింగ్ హామ్, మాంచెస్టర్, ఎక్సెల్ సెంటర్ ప్రాంతాల్లోనూ యుద్ధ ప్రాతిపదికన కరోనా ఆసుపత్రుల నిర్మాణం జరుగుతోంది. ఆసుపత్రుల నిర్మాణంలో ప్రభుత్వం మిలటరీ సాయం తీసుకుంటోంది. ఇక కరోనా పేషెంట్లను తరలించేందుకు మిలటరీ హెలికాప్టర్లు వాడుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా వైద్య పరికరాలు, వైద్య బృందాల తరలింపునకు ఆర్మీ హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. ఇప్పటికే రెండు ఆర్మీ హెలికాప్టర్లను వాడుతున్నారు. ఒకటి స్కాట్లాండ్, నార్తర్న్ ఇంగ్లండ్ ను కవర్ చేస్తోంది. మరొకటి మిడ్ ల్యాండ్స్, సదర్న్ ఇంగ్లండ్ ను కవర్ చేస్తోంది. మూడు రాయల్ ఎయిర్ ఫోర్స్ ప్యూమా హెలికాపర్లను కూడా వాడుతున్నారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యల కోసం 7లక్షల మంది వాలంటీర్లు రంగంలోకి దిగారు. ఆహారం, మందుల సరఫరా తదితర పనులను వారు చూసుకుంటున్నారు. బ్రిటన్ లో 14లక్షల మంది ప్రజలు హోం క్వారంటైన్ లో ఉన్నారు.

యూకేలో ఇప్పటి వరకు 11వేల 658 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 135 మంది ఇప్పటికే కోలుకోగా.. 578 మంది చనిపోయారు. ప్రస్తుతం 4వేల 665 యాక్టివ్ కరోనా కేసులున్నాయని.. అందులో 163 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని యూకే వైద్య అధికారులు తెలిపారు. ఏకంగా బ్రిటన్ ప్రధానికి కూడా కరోనా సోకడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.