Covaxin: కొవాగ్జిన్ డోస్ తీసుకున్న వ్యక్తి డెల్టా వేరియంట్‌తో మృతి

అమెరికాలో రీసెంట్ గా విడుదలైన స్టడీ ప్రకారం.. టెక్సాస్ లో కొవిడ్-19కు ఇన్ఫెక్షన్ కు గురైన ఆరుగురిలో ఒకరు కొవాగ్జిన్ తీసుకుని మృతి చెందినట్లు రికార్డ్ అయింది. ఓ పెళ్లి వేడుకకు హాజరైన వారికి వైరస్ సోకగా మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

Covaxin: కొవాగ్జిన్ డోస్ తీసుకున్న వ్యక్తి డెల్టా వేరియంట్‌తో మృతి

Covid Vaccine (1)

Covaxin: అమెరికాలో రీసెంట్ గా విడుదలైన స్టడీ ప్రకారం.. టెక్సాస్ లో కొవిడ్-19కు ఇన్ఫెక్షన్ కు గురైన ఆరుగురిలో ఒకరు కొవాగ్జిన్ తీసుకుని మృతి చెందినట్లు రికార్డ్ అయింది. ఓ పెళ్లి వేడుకకు హాజరైన వారికి వైరస్ సోకగా మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు సింగిల్ డోస్ తీసుకున్న వారు మాత్రమే డెల్టా వేరియంట్ నుంచి ప్రొటెక్షన్ పొందగల్గుతున్నారని స్టడీ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఆర్టికల్ ను జర్నల్ నేచర్ గురువారం పబ్లిష్ చేసింది. ఇక రెండు డోసుల వ్యాక్సిన తీసుకున్న వారిలో 95శాతం న్యూట్రలైజ్ గా కనిపిస్తుందని స్టడీ చెప్పింది.

మరో స్టడీలో కొవిడ్-19కు సంబంధించిన డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ గోడలను బద్ధలు కొడుతుంది. ప్రాణాంతకమైన మ్యుటేషన్స్ ను క్రియేట్ చేస్తుందని తెలిసింది. కొత్త వేరియంట్లు ఏర్పడటంతో స్పైక్ ప్రొటీన్ నిర్మాణం పూర్తిగా మారిపోయి ప్రస్తుత వ్యాక్సిన్ పనితీరుకు భిన్నంగా తయారవుతున్నాయి.