కోవిడ్ – 19 (కరోనా) వైరస్ 4 లక్షల మందిని చంపేస్తుంది

  • Published By: madhu ,Published On : February 15, 2020 / 09:33 PM IST
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ 4 లక్షల మందిని చంపేస్తుంది

కోవిడ్ – 19 (కరోనా) వైరస్ భూతానికి ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్..ఆ దేశ ప్రజలను చంపేస్తోంది. వేలాది బలయ్యారు. తాజాగా ఇది యూకేలో వైరస్ వ్యాపిస్తే..4 లక్షల మంది చనిపోతారని శాస్త్రవేత్త, ప్రోఫెసర్ నీల్ ఫెర్గూసన్ వెల్లడించారు. ఇతను లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ప్రోఫెసర్. ఇటీవలే ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు. ఈ వైరస్ గురించి తాను భయపడిపోతున్నానన్నారు. వైరస్‌ను నియంత్రించకపోతే..ప్రపంచ వ్యాప్తంగా మరణాలు సంభవించే అవకాశాలున్నాయని తెలిపారు. 

ఈ వైరస్..ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుస్తోందని, పెద్దలకు మాత్రమే దీని బారిన పడుతున్నారని, పిల్లల్లో చాలా తక్కువ శాతంగా ఉందన్నారు. జనాభాలో 60 శాతం మందికి వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. కోవిడ్  -19 వైరస్ యూకేలో కూడా పాకింది. పలువురు చికిత్స తీసుకుంటున్నారు. వైరస్‌ను నివారించే ప్రయత్నాలు చేపడుతున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు.

ఓ విమానంలో ఓ ప్రయాణీకుడు అనారోగ్యానికి గురికావడంతో అతనికి వైద్య చికిత్స అందించారు. ఇతనికి ఈ వైరస్ లక్షణాలు ఉండే అవకాశాలున్నాయని వైద్యులు భావిస్తున్నారు. విమానాశ్రాయాల్లో తనిఖీల కోసం ఏర్పాట్లు చేశారు. కస్టమర్లు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని యునెటైడ్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. తాము స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. 

Read More : దృష్టిలోపం ఉన్న వారికి ఆడియో పుస్తకాలు

చైనా భూభాగంలో కోవిడ్ – 19 వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 1500 దాటింది. ఒక్క రోజే 143 మంది మృతి చెందారు. రోజుకు 2 వేల 641 మంది వైరస్ బారిన పడుతున్నారని, ప్రపంచ వ్యాప్తంగా 67వేల మందికిపైగానే కేసులున్నట్లు అంచనా.