IceCream Served ‘Cold’,: ఐస్‌క్రీమ్ చ‌ల్ల‌గా ఉంది..నా డబ్బులు ఇచ్చేయమంటూ రెస్టారెంట్ పై కస్టమర్ ఫిర్యాదు

ఐస్‌క్రీమ్ చ‌ల్ల‌గా ఉంది..నా డబ్బులు ఇచ్చేయమంటూ రెస్టారెంట్ పై ఓ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు రెస్టారెంట్ యాజమాన్యం ఇదేం గోలరా బాబూ అంటూ మొత్తుకుంటోంది.

IceCream Served ‘Cold’,: ఐస్‌క్రీమ్ చ‌ల్ల‌గా ఉంది..నా డబ్బులు ఇచ్చేయమంటూ రెస్టారెంట్ పై కస్టమర్ ఫిర్యాదు

Icecream Served 'cold

Complaint of IceCream Served ‘Cold :  ఐస్‌క్రీమ్ చ‌ల్ల‌గా ఉంద‌ని రెస్టారెంట్‌పై ఫిర్యాదు చేసాడు ఓ కస్టమర్. ఏంటీ ఏదో తేడాగా ఉందే అనుకుంటున్నారా? నిజమే. ఐస్ క్రీమ్ చల్లగా ఉందటం..నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయమంటూ ఓ కస్టమర్ రచ్చ రచ్చ చేశాడు. ‘‘ఏంటీ..మరీ ఓవరాక్షన్ కాకపోతే.. ఐస్ క్రీమ్ చ‌ల్ల‌గా కాక‌పోతే వేడిగా ఉంటుందా..? ఎవడండీ వాడు? అని ఆ మేధావి ఎవరో అని అనుకుంటున్నారా? అలాగే అనిపిస్తుంది ఈ విషయం తెలియగానే..సదరు రెస్టారెంట్ కూడా అలాగే అనుకుంది. ఐస్ క్రీమ్ చల్లగా లేకపోతే వేడిగా ఉంటుందా? అని..నిజమే కదా..కానీ మనోడు అపర మేధావి ఐస్ క్రీమ్ చల్లగా ఉంటే కదరదట..! ఇదేం గోలరా బాబూ..ఇలాంటి కస్టమర్ తగిలాడు? వీడి గోలేంటీ..వీడి ప్రాబ్లమ్ ఏంటీ అని మొత్తుకుంది పాపం..ఇంతకీ ఈ ఘటన జరిగింది ఎక్కడంటే యూకేలో..భారతదేశాన్ని 200 ఏళ్లు పరిపాలించిన బ్రిటీష్ దేశంలో..అంతేమరి వాళ్లు మేధావులు కదా..

Read more : నేను డజను మాస్కులు ఆర్డర్ చేస్తే..12మాత్రమే పంపించారు..మిగతావి కూడా పంపించండీ : కస్టమర్ రిక్వెస్ట్..షాక్ అయిన స్టోర్ ఓనర్

యూకేలోని ఓల్డ్‌హామ్‌లో హాస‌న్ హాబిబ్ అనే వ్య‌క్తికి జ‌స్ట్ ఈట్ అనే రెస్టారెంట్ ఉంది. అందులో టేక్ అవే ఉంది. ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ కూడా చేసుకోవ‌చ్చు. అవి బాగుండకపోయినా..లేదా నచ్చకపోయినా డబ్బులు తిరిగి ఇచ్చేస్తుందట ఆ రెస్టారెంట్. దాన్నే అదునుగా తీసుకొని.. చాలామంది ఫుడ్ ఆర్డ‌ర్ చేసి.. ఆర్డ‌ర్ డెలివ‌రీ అయ్యాక కుంటి సాకులు చెప్పి.. మ‌నీ రిఫండ్ చేయాలంటూ రెస్టారెంట్‌పై ఫిర్యాదులు చేస్తున్నార‌ట‌.

దీంట్లో భాగంగానే ఓ వ్య‌క్తి మిల్క్‌షేక్, చీజ్ కేక్‌, ఐస్‌క్రీమ్ ఆర్డ‌ర్ చేసాడు. ఆర్డ‌ర్ డెలివ‌రీ అయ్యాక..వెంట‌నే ఐస్‌క్రీమ్ చ‌ల్ల‌గా ఉంద‌ని..నా డబ్బులు నాకు రిఫండ్ రిక్వెస్ట్ పెట్టాడ‌ట‌. ఇలా చాలామంది సిల్లీ కార‌ణాల‌తో మ‌నీ రిఫండ్ అడుగుతుండ‌టంతో రెస్టారెంట్ ఓన‌ర్.. ఆన్‌లైన్ ఆర్డ‌ర్స్‌, టేక్ అవే, పార్శిల్ సిస్ట‌మ్‌ను ఆపేశాడ‌ట‌.

Readmore : అదనంగా రూ.20 వసూలుకు రూ.7వేలు జరిమానా

యూకేలో ఫుడ్ మీద ఎటువంటి ఫిర్యాదులు వ‌చ్చినా.. ఆ రెస్టారెంట్ వెంట‌నే మ‌నీని క‌స్ట‌మ‌ర్‌కు రిఫండ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని కొంద‌రు క‌స్ట‌మ‌ర్లు కావాల‌ని ఫుడ్ బాగోలేద‌ని.. రిఫండ్ పెడుతుండ‌టంపై జ‌స్ట్ ఈట్ రెస్టారెంట్ ఓన‌ర్.. త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో పార్శిన్ సిస్ట‌మ్‌ను ఆపేసి.. ఎవ‌రైనా క‌స్ట‌మ‌ర్ ఫుడ్‌పై ఫిర్యాదు చేయాల‌నుకుంటే.. దానికి కొంత చార్జ్ వ‌సూలు చేయ‌డం మొద‌లు పెట్టాడు. అలాగే.. క‌నీసం 30 రోజుల వ్య‌వ‌ధి తీసుకొని ఆలోపు నిజంగానే ఫుడ్‌లో ఏదైనా స‌మ‌స్య ఉంటే.. రిఫండ్ ఇవ్వ‌డం ప్రారంభించారు.