అదనంగా రూ.20 వసూలుకు రూ.7వేలు జరిమానా

  • Published By: vamsi ,Published On : February 3, 2020 / 05:13 AM IST
అదనంగా రూ.20 వసూలుకు రూ.7వేలు జరిమానా

వాటర్ బాటిల్‌పై అదనంగా 20రూపాయలు వసూలు చేసినందుకు ఓ మల్టిప్లెక్స్ థియేటర్‌కి రూ.7వేలు జరిమానా వేసింది కన్జూమర్ ఫోరమ్. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన రాయల్ మీనాక్షీ మల్టీప్లెక్స్, సినీపొలిస్‌లో ఓ వ్యక్తి రూ. 20 వాటర్ బాటిల్ కొన్నారు. అయితే దానికి సదరు థియేటర్ నిర్వాహకులు రూ. 7వేలను వసూలు చేశాడు. గరిష్ట రిటైల్ ధర (ఎమ్‌ఆర్‌పీ) రూ .20గా ఉంటే రూ. 40 వసూలు చెయ్యడంపై సదరు కస్టమర్ కన్జూమర్ కోర్టు(వినియోగధారుల హక్కుల ఫోరం)కు వెళ్లాడు.

ఫిర్యాదుదారుడు వేసిన పిటీషన్‌లో మల్టిప్లెక్స్, 500 మి.లీ బాటిల్ నీటికి తన దగ్గర రూ .40 వసూలు చేసిందని, 1 లీటర్ బాటిల్ నీటికి రూ .50 వసూలు చేస్తున్నట్లు వెల్డించాడు. ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పకుండా ఎమ్ఆర్‌పీకి రెట్టింపు ఎందుకు వసూలు చేశారో చెప్పకపోవడంతో వినియోగదారుల కోర్టు ఫిర్యాదుదారునికి మానసిక వేదన కలిగించినందుకు రూ .5 వేలు, కోర్టు ఖర్చుల కోసం ఉపయోగించిన రూ. 2వేలు చెల్లించాలని మరియు నీటి బాటిల్‌కు వసూలు చేసిన అదనపు రూ .20ను 12శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని మల్టీప్లెక్స్‌ను ఆదేశించింది.

ఫిర్యాదుదారుడు జూన్ 2017 లో నీటి బాటిల్‌ను కొనుగోలు చేసినందున, మొత్తం కేసు దాని తుది తీర్మానానికి రావడానికి రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం పట్టింది. హోటళ్ళు, రెస్టారెంట్లకు మాత్రమే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బాటిల్‌ వాటర్‌ను కంటే ఎక్కువ ధరలకు విక్రయించడానికి అనుమతి ఉందని ఈ సంధర్భంగా కోర్టు అభిప్రాయపడింది.