Earthquake In Turkey : టర్కీలో మరోసారి భూకంపం.. నాలుగోసారి భూ ప్రకంపనలు

తాజాగా టర్కీలో మరోసారి భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు అయింది. నిన్న మూడు సార్లు భూ ప్రకంపనలు రావడంతో టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి.

Earthquake In Turkey : టర్కీలో మరోసారి భూకంపం.. నాలుగోసారి భూ ప్రకంపనలు

Turkey

Earthquake In Turkey : టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. వరుస భూకంపాలు రెండు దేశాలను బెంబేలెత్తిస్తున్నాయి. టర్కీ, సిరియా సరిహద్దుల్లో నిన్న మూడు సార్లు భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దాన్ని నుంచి తేరుకోకముందే తాజాగా టర్కీలో మరోసారి భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు అయింది. నిన్న మూడు సార్లు భూ ప్రకంపనలు రావడంతో టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి. ఇప్పటివరకు 4,500 మందికిపైగా మృతి చెందగా, వేలాది మందికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. శిథిలాల కింద వేలాది మంది చిక్కున్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. టర్కీ, సిరియాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టర్కీ, సిరియాలో వేలాది మందికి గాయాలు అయ్యాయి. ఆగ్నేయ టర్కీ, ఉత్తర సిరియాలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. సిరియాలోని అలెప్పొ, హామా సహా పలు నగరాల్లో వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి.

Earthquakes In Turkey, Syria : శవాల దిబ్బగా టర్కీ, సిరియా.. 4,500 దాటిన మృతుల సంఖ్య

ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. రెండు దేశాల్లో అంతులేని విషాదం నెలకొంది. టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు సంభవించాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రకు వేలాది భవనాలు నేల మట్టమయ్యాయి. అనేక నగరాలు మరు భూమిని తలపిస్తున్నాయి. టర్కీ, సిరియాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించిన తర్వాత గంటల వ్యవధిలో మరో 20 సార్లు శక్తివంతమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా ఈ విలయం చోటు చేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టర్కీలో మొత్తం పది ప్రావిన్సుల్లో భూకంపం విలయం సృష్టించగా 3 వేల భవనాలు ధ్వంసమయ్యాయి.

Frank Hoogerbeets : టర్కీ, సిరియాలో భారీ భూకంపాన్ని ముందే ఊహించిన ఫ్రాంక్.. 3రోజుల క్రితమే ట్వీట్

ఇకపోతే సిరియాలోని ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాలు, ప్రబల్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో కలిపి 1200 మందికిపైగా మరణించినట్లు సమాచారం. వందలాది మంది గాయపడ్డారు. భవనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

టర్కీ, సిరియా దేశాల్లో ప్రకృతి వైపరీత్యానికి యావత్తు ప్రపంచం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఆ దేశాలకు ఆపన్న హస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భూకంప ధాటికి అతలాకుతలమైన టర్కీ, సిరియాలకు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ సహా నెదర్లాండ్, గ్రీస్ సెర్బియా, స్వీగన్, ఫ్రాన్స్ వంటి తదితర దేశాలు ముందుకు వచ్చాయి.