ఈఫిల్ టవర్‌కు బాంబు హెచ్చరికలు

ఈఫిల్ టవర్‌కు బాంబు హెచ్చరికలు

అవును.. ఇది నిజమే. అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశమైన ఈఫిల్ టవర్ కు బాంబు హెచ్చరికలు వచ్చాయి. అయితే దీనిని తేలికగా కొట్టిపారేయలేదు పోలీసు అధికారులు. బాంబు ప్రమాదం ఉందని పసిగట్టిన వెంటనే అక్కడి వీధులన్నింటినీ పోలీస్ కార్లు చుట్టుముట్టాయి. టవర్ కింది ప్రాంతంతో సహా.. సీన్ నది నుంచి ట్రోక్యాడరో ప్లాజా మొత్తం పోలీసులు మొహరించారు.

బాంబు హెచ్చరికలను పట్టించుకోని కొందరు టూరిస్టులు మాత్రం టవర్ కింద నడుచుకుంటూనే పోతున్నారు. బుధవారం ఆ టవర్‌పై ఎవరైనా ఉన్నారేమో అనే సందేహం ఇప్పటికీ అలాగే ఉంది. ఆ సీన్లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు.. గస్తీ కాస్తుండగా వారికి ఫోన్ కాల్ వచ్చింది. ఈఫిల్ టవర్ కు బాంబు ప్రమాదం ఉందని తెలిసింది.

 



 

ఈఫిల్ టవర్ మేనేజ్మెంట్ కు సమాచారం అందించినా.. వారెవ్వరూ పట్టించుకోలేదు. 131ఏళ్ల చరిత్ర ఉన్న ఈఫిల్ టవర్ ను చూసేందుకు రోజుకు 25వేల మంది టూరిస్టులు వస్తుంటారు. కరోనావైరస్ ట్రావెల్ నిబంధనల కారణంగా.. ప్రస్తుతం పర్యటనలు రద్దు అయ్యాయి. ఈఫిల్ టవర్ చూసేందుకు ప్రతి రోజు ఎంట్రీ ఓపెన్ చేసే ఉంచుతారు.

బాంబు ప్రమాదాలు, సూసైడ్ బెదిరింపులు, కార్మికుల సమ్మె వంటి ప్రత్యేక సమయాల్లో మాత్రమే మూసి ఉంచుతారు.