Mark Zuckerberg: ఫ్యాషన్ షోలో స్టైలిష్ లుక్‌లో ఫేస్‌బుక్ సీఈవో .. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫొటోలు.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..

ఎప్పుడూ ఓ టీషర్ట్, జీన్స్ పాయింట్‌లో కనిపించే ఫేస్ బుక్ సీఈఓ జుకర్‌బర్గ్ ఒక్కసారిగా స్టైలిష్ లుక్‌లోకి మారిపోయాడు. ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫ్యాషన్ షో ఎక్కడ జరిగింది, మార్క్ ఎప్పుడు పాల్గొన్నాడని ఆరాతీయగా.. అసలు విషయం తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.

Mark Zuckerberg: ఫ్యాషన్ షోలో స్టైలిష్ లుక్‌లో ఫేస్‌బుక్ సీఈవో .. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫొటోలు.. అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..

Mark Zuckerberg

Mark Zuckerberg: ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఎప్పుడూ టీ షర్టులు, జీన్స్, సాధారణ వస్త్రధారణతో మనకు కనిపిస్తుంటారు. నిత్యం మీటింగ్స్‌తో బిజీబిజీగా గడిపేస్తుంటారు. అలాంటి వ్యక్తి.. ఓ ఫ్యాషన్ షోలో స్టైలిష్ లుక్‌లో రచ్చ చేశాడు. యువతుల మనసులను దోచుకొనేలా వెరైటీ లుక్‌లో కనిపించాడు. అంతేకాదు.. ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెంట్‌ను షేక్ చేస్తున్నాయి.

Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ ఇంటికి మరో చిన్న అతిథి.. ఆనందంతో ఫొటో షేర్ చేసిన మార్క్ ..

ఎప్పుడూ ఓ టీషర్ట్, జీన్స్ పాయింట్‌లో కనిపించే జుకర్ బర్గ్ ఒక్కసారిగా ఇలా మారడంతో నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. ముఖ్యంగా జుకర్ బర్గ్ లుక్స్, స్టైల్ చూసి ఫిదా అవుతున్నారు. అసలు, ఈ ఫ్యాషన్ షో ఎక్కడ జరిగింది, జుకర్ బర్గ్ ఎప్పుడు పాల్గొనారనే వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో నెటిజన్లు అసలు విషయం తెలుసుకొని షాకవుతున్నారు.

Mark Zuckerberg : అయ్యో.. జుకర్‌బర్గ్‌ ఎంత పనైంది.. ఫేస్‌బుక్ సీఈఓకు భారీ నష్టం.. ఒక్క రోజులో ఎన్ని కోట్లు కోల్పోయాడో తెలుసా?

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న జుకర్‌బర్గ్ ఫ్యాషన్ షో ఫొటోలన్నీ అసలైనవి కాదంట. ఈ ఫోటోలన్నీ ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌లు మాత్రమే. ఈ ఫోటోల్లో మోడల్స్‌ను పోలిన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాయి. లినస్ అనే ట్విటర్ యూజర్ జుకర్‌బర్గ్ ఏఐ జనరేటెడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిజమైన చిత్రాలను పోలిఉండే ప్రతిబింబాలు, నీడలు వంటి ఆకట్టుకునే వివరాలతో చిత్రం చాలా నమ్మకంగా ఉంటుంది. ఈ ఫొటోల్లో జుకర్ బర్గ్ పసుపు రంగు దుస్తులతో సరికొత్త ఫ్యాషన్‌ను ఆవిష్కరిస్తూ కనిపిస్తారు.