Delta Covid-19 Variant : డెల్టా వేరియంట్ భయంకరమైనది.. కరోనాపై వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయి!

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) డెల్టా వేరియంట్‌ హానికరమైనదిగా అభివర్ణించారు.

Delta Covid-19 Variant : డెల్టా వేరియంట్ భయంకరమైనది.. కరోనాపై వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయి!

Fauci Describes Delta Covid 19 Variant As 'nasty'

Delta Covid-19 Variant : అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) డెల్టా వేరియంట్‌ హానికరమైనదిగా అభివర్ణించారు. అమెరికాలో డెల్టా వేరియంట్ పై పోరాడేందుకు కొవిడ్-19 వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. డెల్టా వేరియంట్ ఒక హానికర వేరియంట్ గా పేర్కొన్నారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిచెందగల సామర్థ్యం ఎక్కువగా ఉందని అన్నారు.

కోవిడ్-19పై పనిచేసే వ్యాక్సిన్ అందుబాటులో ఉందని చెప్పారు. గత ఏడాదిలో భారత్ లో కనిపించిన ఈ డెల్టా (B.1.617.2) వేరియంట్ అతిపెద్ద ముప్పుగా పేర్కొన్నారు. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (USCDC) ప్రకారం.. డెల్టా వేరియంట్ దేశంలో మొత్తం యాక్టివ్ కోవిడ్ -19 కేసులలో 25శాతం లేదా నాలుగవ వంతు కంటే ఎక్కువగా ఉన్నాయి.

దేశంలో కరోనా వైరస్‌పై అమెరికా పైచేయి సాధించిందని 245వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జూలై 4న అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు. అయితే కోవిడ్-19 నుంచి ఇంకా బయటపడలేదని అన్నారు. డెల్టాను శక్తివంతమైనదిగా తెలిపారు. గత ఏడాది ప్రారంభంలో అమెరికాలో 33,849,624 కరోనా కేసులు చేసినట్లు తెలిపింది. కరోనాతో దేశంలో మొత్తం 607,139 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా, కరోనా కేసులు, మరణాల్లో అత్యధికంగా అమెరికాలోనే ఉన్నాయి.