America : వ్యూస్ కోసం విమానాన్ని కూల్చేసిన యూట్యూబర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష

కాలిఫోర్నియాలోని లాస్ పడ్రెస్ నేషనల్ ఫారెస్టులో 2021 డిసెంబర్ లో తాను కూల్చిన సింగిల్ ఇంజిన్ విమానం శిథిలాలను జాకబ్ ఉద్దేశపూర్వకంగా నాశనం చేశాడని అధికారులు తెలిపారు. ‘నా విమానాన్ని కూల్చివేశాను’ అనే టైటిల్ తో కూడిన వీడియో వైరల్ అయింది.

America : వ్యూస్ కోసం విమానాన్ని కూల్చేసిన యూట్యూబర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష

YouTuber Prison

YouTuber Prison : వ్యూస్ కోసం విమానాన్ని కూల్చిన ఓ యూట్యూబర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన యూట్యూబర్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి ఫెడరల్ కోర్టు తీర్పు వెల్లడించింది. యూట్యూబ్ లో వ్యూస్ సాధించి తద్వారా డబ్బు సంపాదించాలనే కారణంతో విమానాన్ని కూల్చినట్లు తనపై వచ్చిన అభియోగాన్ని అతను అంగీకరించడంతో ఫెడరల్ కోర్టు అతనికి జైలు శిక్ష ఖరారు చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 29 ఏళ్ల ట్రెవర్ డేనియల్ జాకబ్ 2021 నవంబర్ లో ఓ విమానాన్ని నడిపారు.

అయితే గమ్యానికి చేరకముందే పారాచూట్ సాయంతో అతను కిందికి దూకుతూ విమానం పడిపోతున్న దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. విమానానికి అమర్చిన కెమెరాల్లో ఉన్న వీడియోలను తీసుకున్నారు. ఈ వీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. విమాన శకలాలను మాయం చేసి విచారణ అధికారులను తప్పుదోబ పట్టించారు. అయితే విమానాన్ని కూల్చి వేసిన ఆరోపణలను అంగీకరించడంతో ఫెడరల్ కోర్టు అతనికి జైలు శిక్షను ఖరారు చేసింది.

Thailand : దంపతులకు 12,640 ఏళ్ల జైలు శిక్ష.. థాయ్ లాండ్ కోర్టు సంచలన తీర్పు

వ్యూస్ కోసం యూట్యూబర్ తన విమానాన్ని ఉద్ధేశపూర్వకంగా కూల్చినట్లు అమెరికన్ అధికారులు తెలిపారు. ఫెడరల్ విచారణను తప్పించుకోవాలని నేరాన్ని దాచినట్లు ట్రెవర్ జాకబ్ అంగీకరించారు.
యూట్యూబర్ అప్ లోడ్ చేసిన విమానం కూలిన వీడియోను ఏకంగా 30 లక్షల మంది వీక్షించారు. నిందితుడు ట్రైవర్ జాకబ్ పైలట్ లైసెన్స్ ను అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది.

కాలిఫోర్నియాలోని లాస్ పడ్రెస్ నేషనల్ ఫారెస్టులో 2021 డిసెంబర్ లో తాను కూల్చిన సింగిల్ ఇంజిన్ విమానం శిథిలాలను జాకబ్ ఉద్దేశపూర్వకంగా నాశనం చేశాడని అధికారులు తెలిపారు. ‘నా విమానాన్ని కూల్చివేశాను’ అనే టైటిల్ తో కూడిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో సింగిల్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి బయటకు దూకిన జాకబ్ ప్యారాచూట్ సాయంతో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. విమానం అంతటా అమర్చిన కెమెరాలు ప్లేన్ నియంత్రణ కోల్పోయి అడవిలోకి దిగి చివరికి క్రాష్ ల్యాండింగ్ అవడాన్ని చూపాయి.

Youtube Channel: యూట్యూబ్ వ్యూస్ కోసం సూసైడ్ చేసుకున్న స్టూడెంట్

ఈ వీడియ్ క్లిప్ పై ఏవియేషన్ ఔత్సాహికులు తీవ్రంగా మండిపడ్డారు. ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను జాకబ్ సంప్రదించలేదని, ఇంజన్ ను తిరిగి స్టార్ట్ చేసేందుకు ప్రయత్నం చేయలేదని, సేఫ్ ల్యాండింగ్ అయ్యేందుకు పలు ప్రదేశాలున్నా ల్యాండ్ చేయలేదని ఏవియేషన్ అధికారులు గుర్తించారు. విమానం కుప్పకూలగానే బయటపడిన యూట్యూబర్ విమానం శిథిలాలను ధ్వంసం చేశారని ఎఫ్ఏఏ అధికారులు వెల్లడించారు.