Qatar To Host FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌కు హోస్ట్‌గా ఖతార్ .. ఒకప్పుడు మనుషులు నివసించడానికి పనికిరాని ఆ దేశంపైనే ఇప్పుడు ప్రపంచం దృష్టి

ప్రపంచంలోనే అత్యంత కాస్ట్‌లీ గేమ్, స్పోర్ట్స్ ఈవెంట్ ఏదైనా ఉందంటే.. అది కేవలం ఫిఫా వరల్డ్‌కప్. అలాంటి ఒక మెగా టోర్నీకి.. ఖతార్ లాంటి ఓ చిన్న దేశం హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. కొన్నేళ్ల కిందటి వరకు ఫిఫా వరల్డ్‌కప్ ఇక్కడ జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. వందేళ్ల కిందట.. ఖతార్ మనుషులు నివసించడానికి పనికిరాని ప్రాంతంగా గుర్తించారు. ఇప్పుడదే ఖతార్.. ప్రపంచం మొత్తం తన వైపు చూసే స్థాయికి ఎదిగింది. అత్యంత ధనిక దేశాల లిస్టులో చేరింది. ఇదంతా.. ఆ చిన్న దేశానికి ఎలా సాధ్యమైంది?

Qatar To Host FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌కు హోస్ట్‌గా ఖతార్ .. ఒకప్పుడు మనుషులు నివసించడానికి పనికిరాని ఆ దేశంపైనే ఇప్పుడు ప్రపంచం దృష్టి

FIFA World Cup 2022 opens with host country Qatar

Qatar To Host FIFA World Cup : ప్రపంచంలోనే అత్యంత కాస్ట్‌లీ గేమ్, స్పోర్ట్స్ ఈవెంట్ ఏదైనా ఉందంటే.. అది కేవలం ఫిఫా వరల్డ్‌కప్ మాత్రమే. అలాంటి ఒక మెగా టోర్నీకి.. ఖతార్ లాంటి ఓ చిన్న దేశం హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. కొన్నేళ్ల కిందటి వరకు ఫిఫా వరల్డ్‌కప్ ఇక్కడ జరుగుతుందని ఎవరికీ డౌట్ కూడా రాలేదు. వందేళ్ల కిందట.. ఖతార్ మనుషులు నివసించడానికి పనికిరాని ప్రాంతంగా గుర్తించారు. ఇప్పుడదే ఖతార్.. ప్రపంచం మొత్తం తన వైపు చూసే స్థాయికి ఎదిగింది. అత్యంత ధనిక దేశాల లిస్టులో చేరింది. ఇదంతా.. ఆ చిన్న దేశానికి ఎలా సాధ్యమైంది?

కానీ.. మన నగరాలతో.. మన దగ్గరున్న జనాభాతో.. మనం సాధించిన ప్రగతితో.. మన దగ్గర జరిగిన అభివృద్ధితో.. ఖతార్‌కు సంబంధమే లేదు. ఖతార్.. కథే వేరేగా ఉంది. వేరే లెవెల్‌లో ఉంది. కేవలం.. 12 వేల చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న ఓ చిన్న ఎడారి దేశం.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల లిస్టులో ఒకటి. కేవలం.. 29 లక్షల జనాభా మాత్రమే ఉన్న ఓ దేశం.. 29 రోజుల మెగా స్పోర్ట్స్ ఈవెంట్‌కి హోస్ట్ కంట్రీ. అంతేకాదు.. 22వ ఫిఫా వరల్డ్‌కప్ ఎడిషన్ నిర్వహణ కోసం.. 22 వేల కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్న దేశం కూడా అదే ఖతార్. అంటే.. మన కరెన్సీలో దాదాపు 18 లక్షల కోట్లు. ఈ నెంబర్సే.. ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారాయి. ప్రపంచం అటెన్షన్‌ని.. ఖతార్ వైపు తిప్పాయి.

2010లోనే 2022 ఫిఫా వరల్డ్ కప్ ఎడిషన్‌ని నిర్వహించేందుకు ఖతార్ సెలక్ట్ అయింది. అప్పుడు.. ఫిఫా తీసిన డ్రాలో ఖతార్ పేరొచ్చింది. అలా.. 2015 నుంచి ఖతార్ ప్రభుత్వం తమ దేశంలో ఫుట్‌బాల్ స్టేడియాలు నిర్మించడం మొదలుపెట్టింది. వాటిని పూర్తి చేసేందుకు.. ఏడేళ్లు పట్టింది. ఖతార్‌లో నిర్వహిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ మెగా టోర్నీనే.. ఇప్పటివరకు మోస్ట్ కాస్ట్‌లీ ప్రపంచకప్ అని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ సాకర్ టోర్నీని ఖతార్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ వరల్డ్‌కప్ నిర్వహణ కోసం అవసరమైన స్టేడియాల నిర్మాణాలు, మౌలిక వసతులు, నిర్వహణతో పాటు మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం.. ఖతార్ 22 వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టింది. 2018 ఫిఫా వరల్డ్ కప్ కోసం రష్యా ఖర్చు చేసిన దానితో పోలిస్తే.. ఖతార్ 15 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది.

మిడిల్ ఈస్ట్‌తో పాటు ఖతార్‌లో నిర్వహిస్తున్న.. తొలి ఫుట్‌బాల్ ప్రపంచకప్ కూడా ఇదే. ఇందుకోసం.. ఖతార్ 5 నగరాల్లో.. 7 కొత్త స్టేడియాలను నిర్మించింది. దాదాపు 7 నుంచి 8 లక్షల కోట్లు.. కేవలం స్టేడియాల నిర్మాణానికే ఖర్చు పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఖతార్‌ మరో రికార్డ్ కూడా సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించిన అత్యంత చిన్న దేశం కూడా ఖతార్ మాత్రమే. ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూసేందుకు.. దాదాపు 15 లక్షల మంది విజిటర్స్ వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం.. ఖతార్ 80 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ ఆఫర్ చేసింది. అయితే.. మ్యాటర్ ఇక్కడ ఫిఫా వరల్డ్‌కప్ గురించి కాదు. ఇంత చిన్న దేశం.. ఇలాంటి ఒక మెగా టోర్నీని నిర్వహించే స్థాయికి ఎలా ఎదిగింది? రిచ్ కంట్రీస్ లిస్టులోకి ఎలా ఎక్కింది? అనేదే ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది.

సరిగ్గా వందేళ్ల క్రితం.. అంటే 1922లో ఖతార్ నివాసయోగ్యం కాని ప్రాంతంగా గుర్తించారు. అలాంటి దేశం.. ఇప్పుడు ఫిఫా వరల్డ్‌కప్ 22వ ఎడిషన్‌కి వేదికగా మారింది. కొన్నేళ్ల క్రితం వరకు కూడా ఈ మెగా ఈవెంట్.. ఇక్కడ జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. కొన్ని దశాబ్దాల కిందట.. ఖతార్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇక్కడున్న జనాభా కూడా చాలా వరకు ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. కానీ.. ఎక్కడైతే ఖతార్ పడిపోయిందో.. ఇప్పుడు అక్కడే లేచి నిలబడింది. ప్రపంచ పటంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా.. ఖతార్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే చాన్స్ లేకుండా ఆ దేశం తయారైంది.

ఇప్పుడు మనం చూస్తున్న ఖతార్‌కి.. కొన్ని దశాబ్దాల కింద ఉన్న ఖతార్‌కి చాలా తేడా ఉంది. అప్పుడు.. ఇక్కడ నివసించేవారిలో.. మత్స్యకారులు, ముత్యాలను సేకరించేవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. ప్రస్తుతం 90 ఏళ్ల వయసులో ఉన్న ప్రజలకు.. 1930 నుంచి 40ల మధ్యకాలంలో తలెత్తిన భయంకరమైన ఆర్థిక సంక్షోభం.. వాళ్లకు ఇంకా గుర్తుంది. ఆ సమయంలో.. జపాన్ ప్రజలు ముత్యాల సాగు, భారీ ఉత్పత్తిని ప్రారంభించారు. దాంతో.. ఖతార్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అదే దశాబ్దంలో.. ఖతార్‌లోని 30 శాతం జనాభా విదేశాలకు వలస వెళ్లిపోయింది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం.. అప్పుడు ఖతార్ జనాభా 24 వేలకు తగ్గిపోయింది. కానీ.. ఆ తర్వాతే నెమ్మెదిగా ఖతార్ ఆర్థిక వ్యవస్థ బలపడుతూ వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలున్న దేశంగా ఖతార్ ఎదిగిపోయింది. 20వ శతాబ్దం మధ్యలో.. ఖతార్ ఖజానా వేగంగా పెరగడం మొదలైంది. దాంతో.. ప్రపంచంలోనే.. అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా అవతరించింది. ఇప్పుడు.. ఖతార్‌లో లెక్కలేనన్ని టవర్స్, అద్భుతమైన కృత్రిమ దీవులు, అత్యాధునిక స్టేడియాలు, మైండ్ బ్లో అనిపించే టూరిస్ట్ ప్లేస్‌లు.. ఇలా చాలానే ఉన్నాయి. ఇవన్నీ.. ఖతార్ సక్సెస్‌ని అంతెత్తున నిలబెట్టే ఎగ్జాంపుల్స్.