Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని బెడ్ రూంలో సీక్రెట్ కెమెరా..

పాకిస్తాన్ మాజీ ప్రధాని బెడ్ రూంలో సీక్రెట్ కెమెరా పెడుతూ దొరికిపోయాడో వ్యక్తి. స్థానిక మీడియా కథనం ప్రకారం.. అతని ఇంట్లో పనిచేసే వ్యక్తే సీక్రెట్ డివైజ్ ఇన్‌స్టాల్ చేస్తుండగా పట్టుబడ్డాడు.

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని బెడ్ రూంలో సీక్రెట్ కెమెరా..

Imran Khan commends India

Updated On : June 26, 2022 / 12:06 PM IST

 

 

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని బెడ్ రూంలో సీక్రెట్ కెమెరా పెడుతూ దొరికిపోయాడో వ్యక్తి. స్థానిక మీడియా కథనం ప్రకారం.. అతని ఇంట్లో పనిచేసే వ్యక్తే సీక్రెట్ డివైజ్ ఇన్‌స్టాల్ చేస్తుండగా పట్టుబడ్డాడు. బయట వ్యక్తులెవలు డబ్బులిచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరో ఉద్యోగి సెక్యూరిటీ టీంకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బనీ గలా సెక్యూరిటీ టీం ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించడంతో పాటు ఫెడరల్ పోలీసులకు అప్పగించారు.

పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఛైర్మన్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారనే పుకార్ల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. అంతకుముందు వచ్చిన ఆరోపణలు దృష్ట్యా నగరంలోని బని గాలా పరిసర ప్రాంతాలలో భద్రతా ఏజెన్సీలు హై అలర్ట్‌ అయ్యాయి. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రాణాలకు ముప్పు ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Read Also: ఇమ్రాన్ ఖాన్ హ‌త్య‌కు కుట్ర ప‌న్నారంటూ వదంతులు.. ఇస్లామాబాద్‌లో హై అల‌ర్ట్

“ఈ విషయంలో, ప్రభుత్వంతో సహా అన్ని సంబంధిత ఏజెన్సీలకు సమాచారం అందించాం” అని షెహబాజ్ గిల్ తెలిపారు.

మీడియా పోర్టల్‌తో మాట్లాడిన షెహబాజ్ గిల్.. “గదిని శుభ్రపరిచే ఉద్యోగి సీక్రెట్ పరికరాన్ని ఇన్‌స్టాల్ చేయడానికి డబ్బు తీసుకున్నాడు” అని పేర్కొన్నారు. ఈ చర్యను ‘హీనమైనది, దురదృష్టకరం’ అని అభివర్ణించారు.