Comet Closest Earth : ఆకాశంలో అద్భుత దృశ్యం.. 50 వేల ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా వచ్చిన ఆకుపచ్చ తోకచుక్క

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. 50 వేల ఏళ్ల క్రితం కనిపించిన తోకచుక్క మళ్లీ కనిపించింది. ఓ ఆకుపచ్చ తోకచుక్క భూమికి అత్యంత దగ్గరగా వచ్చింది.

Comet Closest Earth : ఆకాశంలో అద్భుత దృశ్యం.. 50 వేల ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా వచ్చిన ఆకుపచ్చ తోకచుక్క

Green Comet

Comet Closest Earth : ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. 50 వేల ఏళ్ల క్రితం కనిపించిన తోకచుక్క మళ్లీ కనిపించింది. ఓ ఆకుపచ్చ తోకచుక్క భూమికి అత్యంత దగ్గరగా వచ్చింది. ఈ తోకచుక్క ఊర్ట్ అనే రహస్య ప్రాంతం నుంచి బయల్దేరింది.

గురువారం రాత్రి ఉత్తరార్ధ గోళంలోని ప్రజలను తోకచుక్క కనువిందు చేసింది. ఆ సమయంలో భూమి నుంచి 42.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్నట్లు నాసా పేర్కొంది. కమ్ముకున్న మబ్బుల కారణంగా కొందరు ఈ తోచకుక్కను చూడలేకపోయారని తెలిపింది.

Mega Comet : సౌర వ్యవస్థలోకి దూసుకొచ్చిన భారీ తోకచుక్క.. మన గ్రహానికి ఏమైనా ముప్పు ఉందా?

భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు ఈ తోకచుక్క ముదురు ఆకుపచ్చ మచ్చ లాగా కనిపించినట్లు వెల్లడించింది. దీనికి C/2022E3 అని నామకరణం చేశారు. ఈ ఆకుపచ్చ తోకచుక్క మళ్లీ ఈ నెల 5న కనిపించనుంది.