Mega Comet : సౌర వ్యవస్థలోకి దూసుకొచ్చిన భారీ తోకచుక్క.. మన గ్రహానికి ఏమైనా ముప్పు ఉందా?

సౌర వ్యవస్థ అవతల వైపున ఒక భారీ తోకచుక్కను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతానికి ఇది నెప్ట్యూన్ కు సమీపంలో ఉందని అంటున్నారు. తోక చుక్క గమనాన్ని ఎప్పటికప్పుడూ పరిశోధకులు నిశితంగా గమనిస్తున్నారు.

Mega Comet : సౌర వ్యవస్థలోకి దూసుకొచ్చిన భారీ తోకచుక్క.. మన గ్రహానికి ఏమైనా ముప్పు ఉందా?

Mega Comet Has Entered Our Solar System

Mega Comet has entered our Solar System : విశ్వంలో సౌర వ్యవస్థ చుట్టూ తోకచుక్కలు, గ్రహశకలాలు, ఉల్కలు ఇలా ఎన్నో పరిభమ్రిస్తుంటాయి. సౌర్య వ్యవస్థ ఏర్పడిన అప్పటినుంచే ఈ తోకచుక్కల ఉనికి ఉంది. వీటి గమన రహాస్యాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు ఖగోళ సైంటిస్టులు సైతం ఎప్పుడూ ఆసక్తిగా పరిశోధనలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు సౌర వ్యవస్థ అవతల వైపున ఒక భారీ తోకచుక్కను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతానికి ఇది నెప్ట్యూన్ కు సమీపంలో ఉందని అంటున్నారు. తోక చుక్క గమనాన్ని ఎప్పటికప్పుడూ పరిశోధకులు నిశితంగా గమనిస్తున్నారు. మన భూగ్రహం వైపు ఏమైనా ఈ తోకచుక్క దూసుకొచ్చే ముప్పు ఉందా? అనేకోణంలో లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

2014 UN271 అని పిలిచే ఈ తోకచుక్క.. సూర్యునికి అతి దగ్గరగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. 2031 నాటికి శనిగ్రహ కక్ష్యలోకి చేరువగా వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. 2014, 2018 మధ్య నిర్వహించిన డార్క్ ఎనర్జీ సర్వే డేటా ఆధారంగా ఈ భారీ తోకచుక్క గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఈ తోకచుక్క పరిమాణం.. 100 నుంచి 370 కిలోమీటర్ల వెడల్పు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సాధారణ తోకచుక్క కంటే దీని పరిమాణం అతి పెద్దదిగా ఉందని, మరగుజ్జు గ్రహం కూడా అయ్యే అవకాశం ఉందని ఖగోళ సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

2014లో మొట్టమొదటిసారిగా ఈ భారీ తోకచుక్కను సైంటిస్టులు గుర్తించారు. ఇది సూర్యుడికి 29 ఖగోళ యూనిట్ల దూరంలో ఉంది. 1 AU భూమి సూర్యుడి మధ్య దూరంగా పరిగణిస్తారు. అప్పటి నుంచి 2014 UN271 దాదాపు 7 AUలో ప్రయాణించింది. ఇప్పుడు సూర్యుడి నుంచి దాదాపు 22 AU దూరంలో ఉంది. ఈ దూరం నెప్ట్యూన్ కంటే మనకు దగ్గరగా ఉంటుందని చెబుతున్నారు. మన సౌర వ్యవస్థలోని గ్రహాలకు కేవలం 10.9 AU సూర్యుని గుండా వెళ్తుంది. అనంతరం శని కక్ష్యకు చేరుకోనుంది. 6,12,190 ఏళ్ల వ్యవధిలో నక్షత్ర అంతరిక్ష సరిహద్దులో అంతర్గత సౌర వ్యవస్థ మేఘం మధ్య విస్తరించి ఉంది. ఈ తోక చుక్క శని గ్రహాన్ని చేరుకోవడానికి ముందు.. సూర్యుడికి దగ్గరగా వచ్చేసరికి ఉపరితలంపై పదార్థంగా ఏర్పడిన కోమా వేడి రేడియేషన్ నుంచి ఆవిరైపోతుంది.