War in Ukraine: ‘ఉక్రెయిన్ కష్టాల నుంచి భారత్ లబ్ధి’.. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఉక్రెయిన్ మంత్రి వ్యాఖ్యలు

‘‘నిజానికి ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తూ ప్రతిరోజు చాలా మందిని చంపుతోంది.. ఉక్రెయిన్లు కష్టాలు ఎదుర్కొంటున్న వేళ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనే అవకాశం భారత్ కు వచ్చింది. మా కష్టాల వల్లే మీరు లబ్ధి పొందుతున్నట్లయితే.. మా సమస్యలను తీర్చేందుకు మీ నుంచి మరింత సాయం కావాలని మేము కోరుతున్నాం’’ అని ఉక్రెయిన్ మంత్రి అన్నారు.

War in Ukraine: ‘ఉక్రెయిన్ కష్టాల నుంచి భారత్ లబ్ధి’.. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఉక్రెయిన్ మంత్రి వ్యాఖ్యలు

russia ukraine tortured prisoners of war says un Human rights office

War in Ukraine: ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు చేసుకుంటుండడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా, ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డిమిట్రో కులేబా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఉక్రెయిన్ కష్టాల నుంచి భారత్ లబ్ధి పొందుతుందని వ్యాఖ్యానించారు. యుద్ధం వేళ రష్యా నుంచి తక్కువ ధరకు భారత్ చమురు దిగుమతులు చేసుకుంటుండడం నైతికంగా సరికాదని చెప్పారు.

‘‘నిజానికి ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తూ ప్రతిరోజు చాలా మందిని చంపుతోంది.. ఉక్రెయిన్లు కష్టాలు ఎదుర్కొంటున్న వేళ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనే అవకాశం భారత్ కు వచ్చింది. మా కష్టాల వల్లే మీరు లబ్ధి పొందుతున్నట్లయితే.. మా సమస్యలను తీర్చేందుకు మీ నుంచి మరింత సాయం కావాలని మేము కోరుతున్నాం’’ అని ఆయన అన్నారు.

ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే, ఆ ఆంక్షలను పట్టించుకోకుండా ఎందుకు చమురు కొంటోందంటూ వచ్చిన విమర్శలకు కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ ఇప్పటికే సమాధానం చెప్పారు. రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ (ఈయూ) పెద్ద మొత్తంలో శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని అన్నారు. దీనిపై డిమిట్రో కులేబా స్పందిస్తూ.. ‘‘యూరోపియన్ యూనియన్ కూడా అదే పని చేస్తోందంటూ వేలెత్తి చూపిస్తే సరిపోదు’’ అని వ్యాఖ్యానించారు. యుద్ధాన్ని ముగించడంలో భారత్ ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు.

Viral Video: రాహుల్‌కి బీజేపీ జెండాలు చూపిన యువకులు.. వారికి రాహుల్ ఫ్లయింగ్‌ కిస్సెస్