Protests by Imran Khan supporters : లాహోర్‌లో ఆగని నిరసనలు.. నెమళ్లు దొంగిలించిన ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు

ఇమ్రాన్‌ఖాన్ అరెస్టుతో పాకిస్తాన్ వేడెక్కింది. ఆయన మద్దతుదారులు చెలరేగిపోతున్నారు. లాహోర్‌లో పలు చోట్ల నెమళ్లు దొంగిలించారు. వీరి నిరసనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Protests by Imran Khan supporters : లాహోర్‌లో ఆగని నిరసనలు.. నెమళ్లు దొంగిలించిన ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు

Protests by Imran Khan supporters

Protests by Imran Khan supporters :  అక్రమాస్తుల కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలు కెళ్లిన సంగతి తెల్సిందే. ఆయన అరెస్టు తర్వాత లాహోర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంలో లాహోర్ కార్ప్స్ కమాండర్ ఇంట్లో నెమళ్లు దొంగిలించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్త బంద్‭కు పిలుపునిచ్చిన పీటీఐ

ఇమ్రాన్‌ఖాన్ అరెస్టు తర్వాత లాహోర్‌లో పరిస్థితులు వేడెక్కాయి. ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంతో పాటు లాహోర్‌లోని కార్ఫ్స్ కమాండర్ అపార్ట్ మెంట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. ఇక ఇంట్లో ఉంచిన నెమళ్లతో సహా పలు వస్తువులను కూడా ఆందోళన కారులు దొంగిలించారు.

Imaran Khan Arrested : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్..

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఒక వ్యక్తిని నెమలిని దొంగిలించి తీసుకెళ్తున్నాడు. దీనిని జనం డబ్బుతో కొన్నారు కాబట్టి అపహరించినట్లు అతను చెప్పాడు. ఇక లాహోర్ లోని ఆర్మీ కార్ప్స్ కమాండర్ మాన్షన్ నుండి తెల్ల నెమళ్లను ఇద్దరు కుర్రాళ్లు దొంగిలించి తీసుకువెళ్లే మరో వీడియో కూడా వైరల్ అవుతోంది.

 

దేశవ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులో ఉంది. ఇమ్రాన్‌ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపై నిరసనలు తెలుపుతూ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు.