Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్త బంద్‭కు పిలుపునిచ్చిన పీటీఐ

మంగళవారం ఇమ్రాన్ అరెస్ట్ అయిన అనంతరమే పీటీఐ వైస్ చైర్మెన్ షా మహ్మూద్ ఖురేషి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పీటీఐ సీనియర్ నేతలు సైఫుల్లా ఖాన్, అజాం స్వాతి, ఎజాజ్ చైదరి సహా మురాద్ సయీద్, అలీ అమీన్ ఖాన్, హసన్ నైజీ నేతలు పాల్గొన్నారు.

Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్త బంద్‭కు పిలుపునిచ్చిన పీటీఐ

Imran Khan Arrest: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‭ అరెస్టుపై ఆ పార్టీ దేశవ్యాప్త బంద్‭కు పిలుపునిచ్చింది. బుధవారం ఉదయమే పీటీఐ కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి ఆందళనకు దిగారు. పీటీఐ పిలుపుకు స్పందనగా కరాచీ, లాహోర్, పెషావర్, రావల్పిండి, ముల్తాన్, గుజ్రవాలా, ఫైసలాబాద్, మర్దాన్ సహా అనేక ఇతర నగరాలు, పట్టణాల్లో దుకాణాలు మూసివేసి మద్దతు తెలిపారు. కొన్నిచోట్ల పీటీఐ కార్యకర్తలు బలవంతంగా దుకాణాల్ని మూయించారు. ఇమ్రాన్ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చిన నిరసన వ్యక్తం చేయాలని, ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పీటీఐ పిలుపునచ్చింది.

Imran Khan Arrest: ఏకంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్‭లోకి దూసుకెళ్లి బీభత్సం చేసిన నిరసనకారులు

మంగళవారం ఇమ్రాన్ అరెస్ట్ అయిన అనంతరమే పీటీఐ వైస్ చైర్మెన్ షా మహ్మూద్ ఖురేషి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పీటీఐ సీనియర్ నేతలు సైఫుల్లా ఖాన్, అజాం స్వాతి, ఎజాజ్ చైదరి సహా మురాద్ సయీద్, అలీ అమీన్ ఖాన్, హసన్ నైజీ నేతలు పాల్గొన్నారు. ఇమ్రాన్ విడుదలకు సంబంధించి పార్టీ చేయాల్సిన పనుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

Karnataka Election 2023: జేడీఎస్‌తో పొత్తుపై కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన ప్రకటన

ఇమ్రాన్ ఖాన్‭ను బుధవారం (ఈరోజు) కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. ఆల్-ఖదీర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ అరెస్ట్ అయినట్లు ఎన్ఏబీ (నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో) అధికారి తెలిపారు. కాగా, పీటీఐ నాయకుల ఇళ్లపై అధికారులు రైడ్లు చేస్తున్నారు. పంజాబ్ ప్రావిన్సులోని అనేక మంది పీటీఐ నేతల ఇళ్లల్లో రైడ్లు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇక రిమాండులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‭ను ముగ్గురు సీనియర్ ఎన్ఏబీ అధికారులు విచారిస్తున్నారట. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‭ను ఇస్లామాబాద్లోని పోలీస్ లైన్ కేంద్ర కార్యాలయానికి మార్చారు. అక్కడే విచారణ కొనసాగుతోంది.